HCA Jaganmohan Rao (imagecredit:twitter)
తెలంగాణ

HCA Jaganmohan Rao: జగన్మోహన్ ​లీలలపై ఈడీ ఫోకస్.. సీఐడీకి లేఖ

HCA Jaganmohan Rao: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న జగన్మోహన్ రావు లీలలపై ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టరేట్ (ED) ఫోకస్ పెట్టిండి. నిధుల గోల్ మాల్​వ్యవహారంలో ఇప్పటికే జగన్మోహన్(Jaganmohan)​ రావుతోపాటు మరికొందరిని అరెస్ట్ చేసిన సీఐడీకి కేసు వివరాలు అందచేయాలంటూ లేఖ రాసింది. కాగా, నిధుల గోల్ మాల్‌కు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association)​ సభ్యులకు చెందిన ఆస్తులను అటాచ్​చేయటం గమనార్హం.

టిక్కెట్ల లొల్లితో..
ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL) మ్యాచ్ ల సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) సన్​రైజర్స్(Sunrisers)​ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య టిక్కెట్ల విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. దీంట్లో జగన్మోహన్​ రావుతోపాటు మరికొందరు సభ్యులు సన్​ రైజర్స్ హైదరాబాద్​ఫ్రాంచైజ్​ను ఇబ్బందులు పెట్టింది నిజమే అని నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు జగన్మోహన్​ రావు అసోసియేషన్​లోని మరికొందరితో కలిసి నిధుల దుర్వినియోగానికి కూడా పాల్పడినట్టుగా తేలింది. ఈ మేరకు విజిలెన్స్​అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.

Also Read: Vijayawada: వీధి కుక్కలపై అమానుషం.. వాడు అసలు మనిషేనా!

మాజీ మంత్రి కృష్ణాయాదవ్ సంతకాలు ఫోర్జరీ
అదే సమయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరమ్​గురవారెడ్డి(Dharamguruva Reddy) సీ‌‌ఐడీ(CID) అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన నిధులను జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి దుర్వినియోగం చేసినట్టుగా అందులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ఐపీసీ 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం జూన్​ 9న కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీంట్లో జగన్మోహన్ రావు మాజీ మంత్రి కృష్ణాయాదవ్ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన అధ్యక్షతన ఉన్న శ్రీచక్ర క్లబ్లో సభ్యత్వం ఉన్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు వెల్లడైంది. వీటి ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్మోహన్​రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని ఏకంగా హైదరాబాద్​క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడైనట్టు తేలింది.

అధ్యక్షునిగా ఏకఛత్రాధిపత్యం వహించిన జగన్మోహన్ రావు బీసీసీఐ నుంచి వచ్చిన దాదాపు 170 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జగన్మోహన్​ రావు, శ్రీనివాసరావు, సునీల్ కుమార్ కంటె, రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను అరెస్ట్ చేశారు. తాజాగా నమోదు చేసిన ఈ కేసు దాంట్లో జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను ఇవ్వాలంటూ ఈడీ అధికారులు సీఐడీకి లేఖ రాశారు. వివరాలు అందిన తరువాత కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.

ఇంతకు ముందే ఆస్తులు అటాచ్
ఇదిలా ఉండగా ఇంతకు ముందే ఈడీ అధికారులు నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ సభ్యులకు చెందిన 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్​ చేయటం గమనార్హం. క్విడ్​ ప్రో కో పద్దతిలో లక్షల రూపాయలను స్వాహా చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు అప్పట్లో ఈడీ అధికారులు ప్రకటించారు. గతంలో క్రికెట్​బాల్స్ బక్కెట్​ కుర్చీలు, జిమ్​ పరికరాల కోసం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ సారా స్పోర్ట్స్​, ఎక్స్​ లెంట్​ఎంటర్ ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్​లిమిటెడ్ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే, మార్కెట్​రేటుకన్నా ఎక్కువ ధరలు కోట్​చేసినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఈ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన ఈడీ అధికారులు హైదరాబాద్​క్రికెట్​అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా, కోశాధికారిగా ఉన్న సురేందర్​ అగర్వాల్ క్విడ్​ప్రోకో పద్దతిన ఈ మూడు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నిర్ధారించారు.

Also Read: Fitness Tips: ఫిట్‌నెస్ విషయంలో ఎవరూ చెప్పని 5 బెస్ట్ టిప్స్ ఇవే

ప్రతీదాంట్లో క్విడ్ ప్రో కో..
క్రికెట్​బాల్స్​సప్లయ్​చేసిన సారా స్పోర్ట్స్​17లక్షల రూపాయలను సురేందర్​అగర్వాల్​భార్య భాగస్వామిగా ఉన్న కేబీ జువెలర్స్​సంస్థ ఖాతాతోపాటు ఆమె వ్యక్తిగత అకౌంట్​లోకి కొంత నగదును ట్రాన్స్​ఫర్​చేసినట్టు నిర్ధారించుకున్నారు. దాంతోపాటు సురేందర్​అగర్వాల్​కుమారుడు అక్షిత్​అగర్వాల్​ఖాతాలోకి కూడా నగదును బదిలీ చేసినట్టు తెలుసుకున్నారు. ఓ మ్యూజిక్​షోను స్పాన్సర్ చేస్తున్నట్టుగా పేర్కొని నగదును ఆయా ఖాతాల్లోకి ట్రాన్స్​ఫర్​చేసినట్టు గుర్తించారు. అదే సమయంలో బకెట్​కుర్చీలు సరఫరా చేసిన ఎక్స్ లెంట్​ఎంటర్​ప్రైజెస్ సంస్థ సురేందర అగర్వాల్, అతని కొడుకు అక్షిత్​అగర్వాల్​ఖాతాలతోపాటు వజ్రాలు కొన్నట్టుగా పేర్కొంటూ కేబీ జువెలర్స్​ అకౌంట్​ లోకి 21.86లక్షల రూపాయలను బదిలీ చేసినట్టుగా ఈడీ విచారణలో వెల్లడైంది. ఇక, జిమ్​ పరికరాలను సరఫరా చేసిన బాడీ డ్రెంచ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ 52 లక్షల రూపాయలను సురేందర్​ అగర్వాల్​, ఆయన కోడలి ఖాతాల్లోకి ట్రాన్స్​ ఫర్​ చేసినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు సురేందర్​ అగర్వాల్ ఆయన కుటుంబ సభ్యుల పేరన ఉన్న 51.29 లక్షల ఆస్తులను మార్చి నెలలో అటాచ్​ చేశారు.

జగన్మోహన్​ రావుపై కూడా..
తాజాగా సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు అడిగిన ఈడీ అధికారులు అవి అందగానే జగన్మోహన్​రావుతోపాటు మిగితావారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జగన్మోహన్​రావు భారీ మొత్తాల్లో నిధులను గోల్​మాల్​చేసినట్టుగా సీఐడీ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఆ వివరాలను కూడా తెలుసుకోనున్నారు. హైదరాబాద్ క్రికెట్​అసోసియేషన్​అధ్యక్షునిగా ఉన్న సమయంలో జగన్మోహన్​ రావు ఏయే సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు? వాటిని నిబంధనల ప్రకారమే ఇచ్చారా? అస్మదీయులకు ఇచ్చారా? కాంట్రాక్టుల విలువ ఎంత? అన్న వివరాలు సేకరించనున్నారు. ఇక, కాంప్లిమెంటరీ టిక్కెట్లను కూడా జగన్మోహన్​ రావు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఆ వివరాలను కూడా తెలుసుకోనున్నారు. అవినీతి జరిగినట్టుగా పక్కా ఆధారాలు చిక్కితే ఇంతకు ముందులానే జగన్మోహన్​రావు, అతనితోపాటు అరెస్టయిన వారి ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Congress on KTR: మెదక్ ప్రజలను గాడిదలు అన్న కేటిఆర్.. ఎస్పీకి ఫిర్యాదు

 

 

 

Just In

01

Bandi Sanjay: ఆయన తండ్రే ఎం చేయలేక పోయిండు కొడుకు ఎం చేస్తాడు: బండి సంజయ్

Student death In US: ఛాతిలో నొప్పిని విస్మరించి.. అమెరికాలో ఏపీ యువతి మృతి

Komatireddy Venkat Reddy: చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు.. రూ.60,799 కోట్లతో తెలంగాణలో రోడ్ల శకం

Bellamkonda Suresh: ఇల్లు కబ్జా.. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి