Fetal murders (imagecredit:twitter)
తెలంగాణ

Fetal murders: కాసుల కోసం భ్రూణ హత్యలు.. కక్కుర్తి పడుతున్న డాక్టర్లు!

Fetal murders: పటిష్టమైన చట్టాలున్నాయి కఠిన శిక్షలు పడతాయి అయినా కొందర వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఆడపిల్లలు వద్దనుకుంటున్న తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకుంటూ భ్రూణ హత్యలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పెద్ద ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఆర్​ఎంపీ డాక్టర్లు కొందరిని ఏజెంట్లుగా చేసుకుని సాగిస్తున్న ఈ దారుణాల గురించి తెలిసినా అడ్డుకోవటానికి అధికార యంత్రాంగాలు పెద్దగా చర్యలు తీసుకోవటం లేదు. ఏదైనా సంఘటన జరిగినపుడు కొన్నిరోజులు హడావిడి చేస్తున్నారు తప్పితే జరుగుతున్న భ్రూణ హత్యలను అడ్డుకోవటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం లేదు.

మెడికల్ టర్మినేషన్​ఆఫ్​ప్రెగ్నెన్సీ యాక్ట్​1971

నిజానికి మెడికల్ టర్మినేషన్​ఆఫ్​ప్రెగ్నెన్సీ యాక్ట్​1971 ప్రకారం మన దేశంలో అబార్షన్లు జరిపించుకోవచ్చు. అయితే, ఇలా చేయాలంటే గర్భస్థ శిశువు వయసు12 వారాలలోపు ఉండాలి. అబార్షన్​ అవసరమని రిజిష్టర్డ్ డాక్టర్​నివేదిక తప్పనిసరి. గర్భస్థ శిశువు వయసు 12 వారాలు దాటితే ఇద్దరు డాక్టర్ల నివేదిక ఉండాలి. ఇక, ఈ చట్టంలోని 3వ సెక్షన్​ ప్రకారం గర్భధారణ తల్లి ప్రాణానికి ప్రమాదమని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తేలితే అబార్షన్ చేయవచ్చు.

మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష

అయితే, చాలా మంది పుట్టబోయేది ఆడబిడ్డ అని నిర్ధారించుకుని అబార్షన్లు చేయించుకుంటున్నారు. డబ్బు తీసుకుని వైద్యులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే డాక్టర్లపై చట్టరీత్యా కేసులు నమోదు చేయవచ్చు. వీటిల్లో మూడు నుంచి ఏడేళ్ల వరుకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు డాక్టర్​ లైసెన్స్​ కూడా రద్దవుతుంది. అసలు పుట్టబోయేది ఎవరన్నది లింగ నిర్ధారణ చేయటమే నేరం. ఇక, అబార్షన్​ చేయించుకోవాలని ఒత్తిడి చేసేవారికి కూడా చట్టంలో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా పడే వీలున్న సెక్షన్లు ఉన్నాయి.

Also Read: CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్.. ఈసారి కథ వేరుంటది.. ఎందుకంటే!

ఆడ శిశువా? మగ శిశువా?

ఇలా కఠినమైన చట్టాలున్నా వాటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగాలు పెద్దగా పట్టించుకోక పోవటాన్ని అవకాశంగా చేసుకుంటున్న కొందరు డాక్టర్లు డబ్బు సంపాదించటమే ధ్యేయంగా అబార్షన్లు చేస్తున్నారు. సాధారణంగా మహిళలు గర్భం దాల్చగానే గైనకాలజిస్ట్​ వద్దకు వెళతారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రతీనెలా వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆ సమయంలో డాక్టర్లు స్కానింగ్​ చేస్తారు. అయితే, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందా? లేదా? అన్నది తెలుసుకోవటానికి మాత్రమే ఈ స్కానింగులు పరిమితమై ఉండాలి. తప్పితే గర్భంలో ఉన్నది ఆడ శిశువా? మగ శిశువా? అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించ వద్దు. అయితే, కొందరు వైద్యులు పుట్టబోయేది ఎవరో ముందే చెప్పేస్తున్నారు. ఆడబిడ్డ వద్దనుకునే వారి నుంచి దండిగా డబ్బు తీసుకుంటూ భూమ్మీదకు రాక ముందే శిశువుల ప్రాణాలు తీస్తున్నారు. గర్భస్థ శిశువు వయసు 12 వారాలలోపు ఉంటే గర్భస్రావాలు చేస్తున్నారు. దాటితే సర్జరీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తల్లి ప్రాణాలు కూడా పోతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సూర్యాపేటలో ఇదే విధంగా ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇక, మిడిమిడి జ్ఞానంతో ఆర్ఎంపీ డాక్టర్లు, నాటువైద్యులు చేస్తున్న గర్భస్రావాలతో ఎన్నో విషాదాలు జరుగుతున్నాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు

ఇలా జరుగుతున్న అబార్షన్లకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగాలు అలసత్వంతో వ్యవహరిస్తున్నాయి. జిల్లా వైద్యాధికారులు తమ తమ పరిధుల్లో ఈ తరహా కార్యకలాపాలపై కన్నేసి పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్టు తెలిసినా ఏదైనా హాస్పిటల్ లో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నారని సమాచారం అందినా దాడులు జరపాలి. ఆరోపణలు నిజమని తేలితే ఆస్పత్రులను సీజ్ చేయాలి. బాధ్యులైన వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు నమోదయ్యేలా చూడాలి. అయితే, ఈ దిశలో వైద్యాధికారులు పెద్దగా చర్యలు తీసుకోవటం లేదు. పోలీసు యంత్రాంగం కూడా ఈ దిశగా పెద్దగా దృష్టి సారించటం లేదు.

రివార్డులు ఇస్తామంటే

ఏదైనా ఆస్పత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టయితే ఆ విషయం అందులో పని చేసే స్వీపర్ మొదలుకుని సిబ్బంది అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్రమ అబార్షన్ల గురించి సమాచారం ఇస్తే రివార్డులు ఇస్తామని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామని పోలీసులు చెబితే ఆయా హాస్పిటళ్లలో పని చేసేవారే ఇన్ఫార్మర్లుగా మారి సమాచారం ఇస్తారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

Also Read: Bandi Sanjay: కాంగ్రెస్ వదిలిన బాణమే కవిత.. బండి సంచలన వ్యాఖ్యలు!

 

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!