*21* Scam: *21* నంబర్లకు కాల్స్ చేయకండి.. నయా మోసం
Cyber-Scam (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

*21* Scam: *21*తో మొదలయ్యే నంబర్లకు కాల్స్ చేయకండి.. మొదలైన నయా మోసం

*21* Scam: *21*సైబర్ క్రిమినల్స్ నయా మోసాలు

బ్లూ డార్ట్ డెలివరీ పేరిటతో వల
*21*తో మొదలయ్యే ఫోన్​ నెంబర్లు పంపుతున్న వైనం
ఆ నంబర్లకు కాల్ చేస్తే.. ఫోన్ హ్యాక్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఓవైపు సైబర్ నేరాలకు చెక్ పెట్టటానికి పోలీసు యంత్రాంగం విస్తృత చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు సైబర్  క్రిమినల్స్ కొత్త కొత్త మార్గాలలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘బ్లూ డార్ట్ కొరియర్’​ పేరిట జనాన్ని ఉచ్ఛులోకి లాగుతున్నారు. *21*తో మొదలయ్యే ఫోన్ నెంబర్లను పంపిస్తూ డబ్బు కొల్లగొడుతున్నారు.

*21*తో నెంబర్​ వస్తే జాగ్రత్త…

‘బ్లూర్ట్​ కొరియర్ ద్వారా మీకు పార్సిల్ వచ్చింది… మా డెలివరీ బాయ్​ మీ ఇంటి పరిసరాల్లోనే ఉన్నాడు. అయితే, అడ్రస్​ దొరకటం లేదు’ అంటూ ఒకేసారి వేలాది మొబైల్​ ఫోన్లకు మెసెజు పంపిస్తున్నారు. ఈ నెంబర్​‌కు కాల్​ చేసి అడ్రస్ చెబితే వచ్చి డెలివరీ ఇస్తాడని పేర్కొంటున్నారు. పంపిస్తునన మెసేజులో *21*తో మొదలయ్యే సెల్​ నెంబర్లను పంపిస్తున్నారు. పూర్తి నెంబర్‌ను డయల్ చేయాలని సూచిస్తున్నారు. కానీ, ఇలా *21*తో మొదలయ్యే నెంబర్‌కు కాల్ చేస్తే వ్యక్తుల ఫోన్​ సైబర్​ క్రిమినల్స్​ ఆధీనంలోకి వెళ్లిపోతుందని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. నిజానికి *21*తో వచ్చే నెంబర్ ఫార్వర్డ్​ మెసెజీకి సంబంధించిందని తెలిపారు. దీనిని డయల్​ చేస్తే ఫోన్​‌కు వచ్చే ప్రతి కాల్​, మెసెజ్​ సైబర్ క్రిమినల్స్​ కు ఫార్వర్డ్​ అవుతాయని వివరించారు.

ఇలా బ్యాంక్​ ఖాతాల వివరాలు, ఓటీపీ నెంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని కొల్లగొగతారని తెలిపారు. దీని ఆధారంగా డబ్బు కొల్లగొడుతారని చెప్పారు. ఇటీవలిగా రాష్ట్రంలోని పలువురికి ఇలా బ్లూ డార్ట్ డెలివరీ పేర మెసెజీలు వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి మెసెజీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కొరియర్​ లో ఏం వచ్చిందో? అన్న ఉత్సుకతతో సైబర్​ క్రిమినల్స్ పంపించిన నెంబర్​ కు కాల్ చేస్తే మునిగి పోతారని హెచ్చరించారు.

Read Also- Errolla Srinivas: కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ.. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్!

ఇప్పటికే ట్రేడింగ్​, ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సైబర్ కేటుగాళ్లు మోసాలు చేస్తున్నారు. వాటర్, కరెంట్​ బిల్లులు, ఆధార్ అప్‌డేట్​ వంటి సేవల పేర్లు చెప్పి ఏపీకే ఫైళ్లను ఒకేసారి వేల మొబైల్ ఫోన్లకు సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు.  అయితే, కొంతకాలంగా ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. ప్రచార మాధ్యమాలు, సోషల్​ మీడియా ద్వారా మోసాలు జరుగుతున్న తీరును వివరిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో సైబర్​ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు రూట్ మారుస్తూ కొత్త తరహా నేరాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా బ్లూ డార్ట్ డెలివరీ పేరిట తాజాగా కొత్త మోసాలకు తెర తీశారు.

Read Also- Ravi Teja: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..

Just In

01

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!