Bigg Boss 9 Telugu: తెలుగు బుల్లి తెర ప్రపంచాన్ని ఏలుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’. ఈ రియాలిటీ షో ఇప్పటికి 83 రోజులు పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ వీక్ తర్వాత నాగార్జున రాయల్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న వారికి ఈ రోజు ఎలిమినేటర్ అయ్యేది ఎవరు అన్న దానిపై అందరిలో ఆందోళన నెలకొంది. చివరికి నాగార్జున మాట్లాడుతూ.. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు అనుకున్నా కానీ అలా కనబడటం లేదు, ఎందుకో అందరూ చాలా ఆందోళనగా ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత అసలు టాస్క్ మొదలైంది. గ్రూప్ సభ్యుల్లో మీకు ముఖ్య మూడు భాగాలు గా విభజించాం అందులో అందులో ఒకరు వారియర్, ఎనిమీ, వెన్నుపోటుదారు ఉంటారు. అందులో ఒక్కొక్కరూ వచ్చి మీకు ఎనిమీ ఎవరు? వెన్నుపోటుదారు ఎవరు అని చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది ఎవరిని ఎనిమీగా ఎంచుకున్నారు. ఎవరిని వెన్నుపోటుదారుగా ఎంచుకున్నారు. అనేది ప్రోమోలో చూడాల్సిందే..
Read also-Ravi Teja: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..
బిగ్ బాస్ 9 తెలుగు ప్రోమోను చూస్తుంటే.. నాగార్జున కొంచెం సీరియస్ గా కనిపించారు. ఈ రోజు టాస్క్ మంచి కిక్ ఇచ్చేదిగా ఉంది. ముందుగా భరణి వచ్చి ఈ టాస్క్ పూర్తి చేశారు. అందులో ఎనిమీగా డెమాన్ పవన్ ను ఎంచుకోగా వెన్నుపోటుదారుగా సంజనను ఎంచుకున్నారు. తర్వాత కళ్యాణ్ వచ్చి ఈ టాస్క్ పూర్తి చేశారు. తర్వాత పవన్ వచ్చి బాంబ్ పేల్చాడు. అది ఏమిటంటే.. తనకు ఎనిమీగా ఎమ్మన్యూయేల్ ను ఎంచుకోగా వెన్నుపోటుదారుగా మాత్రం కళ్యాణ్ ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కూడా తెలిపాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. తర్వాత రీతూ .. తనూజా కూడా వెన్నుపోటుదారుగా ఒకరినే ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ ప్రోమో చూడాల్సిందే.
ఇంతకు ముందు ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ.. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు అనుకున్నా కానీ అలా కనబడటం లేదు. ఎందుకో అందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. ఎవరికైనా ఎమైనా జరిగిందా.. అని ఇమ్యాన్యూయేల్ ను అడిగారు. దీంతో ఇమ్మూ.. సంజనా గారు రీతూ విషయంలో చేసింది చాలా విచారంగా అనిపించిందని అన్నారు. ఇదే విషయం హౌస్ మొత్తానికి ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. ఇమ్యానియేల్ కు మద్దతుగా సుమన్ శెట్టి కూడా.. అమ్మయిని అలా అనడం తప్పేకద సార్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జునకు కోపం వచ్చింది. సంజనా వెళ్లిపోతావా అంటూ బిగ్ బాస్ గెట్లు తెరవమన్నాడు. దీంతో బిగ్ బాస్ గెట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే..

