Kisik Talks Promo: తెలుగు బుల్లితెరపై ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన సెలబ్రిటీ టాక్ షోలలో ‘కిసిక్ టాక్స్’ ఒకటి. ముఖ్యంగా కామెడీ షో ‘జబర్దస్త్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తుండడం ఈ షోకు ప్రధాన ఆకర్షణ. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ, వారి జీవితంలోని తెలియని కోణాలను, కాంట్రవర్సీలను నిర్భయంగా బయటకు తీసే విధంగా ఈ షో ఫార్మాట్ రూపొందించబడింది. తాజాగా ఈ టాక్ షోకు వచ్చిన ప్రముఖ సీరియల్ నటి శ్రీవాణి కొంత సేపు నవ్వించినా తర్వాత సీరియల్ మాత్రం అందరినీ ఏడిపించింది. ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో ఆమె తన ఇన్కమ్ గురించి చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అంతే కాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ కంట నీరు తెచ్చుకున్నారు.
Read also-Akhanda Ticket: బాలయ్య ‘అఖండ 2’ మొదటి టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. క్రేజ్ అలాంటిది..
అంతే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన బోలెడన్ని కబుర్లు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ఆయన ఉన్నా లేనట్టే అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తన తండ్రిక ఇద్దరు భార్యలు ఇద్దరూ సొంత అక్కా చెలెళ్లు మా అంటే ఇష్టం ఉండేది కాదు. అందులోనూ నేను అమ్మాయిని పుట్టానన్ని కోపం ఆయనకు. అందుకు ఎప్పుడూ నన్ను పట్టించుకోలేదు. అంతే కాకుండా కేవలం మాల తీయడానికి మాత్రమే ఇంటికి వచ్చేవారు అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తన యూట్యూబ్ ఇన్కమ్ కోసం చెబుతూ అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్య పరిచింది. మొదటిగా యూట్యూబ్ నుంచి రూ. 10000 తీసుకునన్నానని ఆ తర్వాత అది దాదాపు నెలన్నరకు రూ. 30 లక్షల వరకూ వచ్చిందంటూ చెప్పుుకొచ్చారు. తన ఆస్తి గురించి కూడా చెప్పుకొచ్చారు. అది ఎంతో తెలియాలంటే పూర్తి వీడియో వచ్చే వరకూ ఆగాల్సిందే.
Read also-Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకి హిట్ పడినట్టేనా? ఐరన్ లెగ్ ఇమేజ్‌ని బీట్ చేసిందా?

