Schools Reopen: ఈ నెల 12 నుంచి హైదరాబాద్ జిల్లాలోని స్కూల్స్ రీ ఓపెన్ కానున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు పునః ప్రారంభమయ్యే ఫస్ట్ డే 12న ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో తోరణాలు కట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్వాగతం పలకాలని పాఠశాలల సిబ్బందికి కలెక్టర్ సూచించారు. 12వ తేదీలోపే ప్రతి పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు వంద శాతం యూనిఫామ్, టక్స్ట్, నోట్, వర్క్ బుక్స్ అందించాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
యూనిఫామ్‌లు అందించండి
స్కూల్స్ రీ ఓపెన్ పై కలెక్టర్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యా, వైద్య, సంక్షేమ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్ జిల్లాలో లక్షా 3 వేల 912 జతల యూనిఫామ్ లు, 9 లక్షల 63 వేల 307 టక్స్ట్ బుక్‌లు, 6 లక్షల 25 వేల 660 నోట్ బుక్ లను, మరో లక్షా 47 వేల 951 వర్క్ బుక్‌లు విద్యార్థులకు పంపిణీ కావల్సి ఉన్నాయని, వీటన్నింటిని ఈ నెల 12వ తేదీలోపు నూటికి నూరు శాతం విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. పాఠశాల సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పకుండా బడి బాట యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని, దాని ద్వారా విద్యార్థుల హాజరు, గైర్హాజరు, సంఖ్యను ఎప్పటికపుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
Also Read: YS Jagan: అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్!
పెండింగ్ పేమెంట్లు చెల్లింపులు
బడి బయట ఉన్న పిల్లలందరికీ బడికి తీసుకువచ్చేందుకు ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్కూల్స్ రీ ఓపెన్ రోజున వసతి గృహాల్లోని కిచెన్ రూమ్, బెడ్ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పెండింగ్ పేమెంట్లు ఉంటే వెంటన్ చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు 1941 ఉన్నారని, వారందరూ పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలో 21 భావిత సెంటర్లు ఉన్నాయని, వాటిని రెన్యూవేషన్ చేయాలని, భవిత సెంటర్ లను నీట్‌గా ఉండేలా చూడాలని, ఈ సెంటర్లు లేని చోట ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
అంగన్‌వాడీల వారీగా డేటా
క్షేత్రస్థాయిలో డిప్యూటీ ఈ వో, డిప్యూటీ ఐఓఎస్‌లు పర్యవేక్షించాలని ఆదేశించారు. బాల్ భరోసా సర్వే అయిపోయిందని డేటాను యాప్‌లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు. సీడీపీఓలు అంగవైకల్యం గల హార్ట్, క్రిటికల్ సర్జరీ చేయవల్సి ఉన్న పిల్లలకు తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లి, బాల్ భరోసా కింద వైద్య సేవలు అందించేందుకు జాబితా తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడి బాట కార్యక్రమంలో రెండు సంవత్సరాలు గల పిల్లలకు అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని, సీడీపీఓ సూపర్ వైజర్ అంగన్‌వాడీల వారీగా డేటా సమర్పించాలని ఆదేవించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఈ వెంకటాచారి, డీఈఓ ఆర్. రోహిణి, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి, జిల్లా సంక్షేమాధికారులు ఆర్.కోటజీ, ఇలియాజ్ అహ్మద్, డాక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: IAS Bribe Scandal: అడ్డంగా దొరికిన ఐఏఎస్.. ఇదేం పాడు పనయ్యా నీకు?