Disqualification Hearing: 8 గంటలకు సుదీర్ఘ విచారణ
ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన స్పీకర్
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటలకు విచారణ
ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య క్రాస్ ఎగ్జామినేషన్
ఈ నెల 4న గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి విచారణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో రోజు బుధవారం విచారణ (Disqualification Hearing) ముగిసింది. అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఎదుట పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు విచారణ మొదలై, సుధీర్ఘంగా కొనసాగింది. ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్యను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రాత్రి 7 గంటల వరకు ఇద్దరి ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సుదీర్ఘ విచారణ జరుగడంతో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణామోహన్ రెడ్డిల విచారణ ఈ నెల 4న చేపట్టాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ ఇద్దరిని 4న పిటిషనర్ తరపు న్యాయవాదులు హాజరై క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
Read Also- Innovative idea: భలే ఐడియా గురూ!.. రూ.16 లక్షల ఫ్లాట్ ఎవరూ కొనడం లేదని.. ‘మేధావి ప్లాన్’
అయితే, క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్యలు తాము పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెప్పినట్టు సమాచారం. నియోజకవర్గ అభివృద్ది కోసమే ముఖ్యమంత్రిని కలిశామని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా మీడియాలో వచ్చిన వార్తలతో పాటు పలు ఆధారాలను కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్ ముందు పెట్టి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫొటోలు, వీడియోలను చూపించి వివరణ కోరినట్లు తెలిసింది. అయినప్పటికీ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉన్నామని పదేపదే చెప్పినట్లు తెలిసింది.
Read Also- Ramchander Rao: ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు: రాంచందర్ రావు