DGP Jithender: ప్రజలతో సంబంధాలు మెరుగు పరుచుకున్నపుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని డీజీపీ జితేందర్ అన్నారు. ప్రతీ పోలీస్ అధికారి దీనిని గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని వేర్వేరు యూనిట్లలో ఏఎస్పీలుగా పని చేస్తున్న అధికారులతోపాటు శిక్షణలో ఉన్న వారితో డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలు పెంచుకున్నపుడే నేరాలకు సంబంధించిన సమాచారం, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. ఆయా శాఖల అధికారులు, ఉన్నతాధికారులతో సమన్వయం ఏర్పరుచుకుంటే ఉత్తమ అధికారులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుందన్నారు.
నేరాలపై జాగ్రత పాటించండి
ఏఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ ప్రాంతాల్లో ఉన్న ఆచారాలు, కట్టుబాట్లు గురించి తెలుసుకోవాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నా బేసిక్ పోలీసింగును మరిచి పోవద్దన్నారు. ఇకపై ప్రతినెలా ఏఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. హత్యలు, ఆర్థిక నేరాలు జరుగుతున్న చోట జాగ్రత్త వహించాలన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే నేరస్తులను సులువుగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ మహేష్ భగవత్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ, శాంతిభద్రతల ఏఐజీ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Indian Soldier: సైన్యానికి రైల్వే కష్టాలు.. సీట్ల కోసం పడిగాపులు.. పట్టించుకోండి!