Bhatti Vikramarka: వైరా నియోజకవర్గం ముసలిమడుగు గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముచ్చటించారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్ధమవుతున్నాయా? మీరు బాగా చదువుతున్నారు? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? డైట్ చార్ట్ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని బాలికలను ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
Also Read: Huzurabad Crime News: గర్భిణి హత్య కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. సంచలన నిజాలు వెలుగులోకి?
ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన డైట్ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు గుడ్డు, అదేవిధంగా చార్ట్ ప్రకారం చికెన్, మాంసాహార వంటలను అందిస్తున్నారని చెప్పారు. పాఠ్యాంశాలను అధ్యాపకులు చక్కగా బోధిస్తున్నారని స్టడీ అవర్స్ లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ చదువు చెబుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురుకుల పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు విద్యార్థినులకు డైట్ మెనూతో పాటు బాలికలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.