Bhatti Vikramarka: అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం
Bhatti Vikramarka (image credit: swetcha reporter)
Telangana News

Bhatti Vikramarka: అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం… ప్రజా సంక్షేమమే లక్ష్యం.. భట్టి విక్రమార్క హెచ్చరిక!

Bhatti Vikramarka: రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టాం అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అనుకున్న లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వం సహించదు, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం అన్నారు.

అదృష్టం అది కొందరికే దక్కే అవకాశం

అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరు విషయంలో సీరియస్ గా ఉండాలి అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ సమయంలో ముందుగా వెళ్లి ఫేస్ రికగ్నైజేషన్, థంబ్ ఇంప్రెషన్ ఇస్తున్నాం అని వివరించారు. ప్రజలు కష్టంతో వారు చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని జీతాలుగా పంచుతున్నాం ప్రజలకు అందరం జవాబు దారిగా ఉండాలి అన్నారు. విధులు ఎలా ఉంటాయి అనేది శాఖల వారీగా ప్రోటోకాల్ ఉంటుంది అందరూ దాన్ని పాటించాలి అన్నారు, ఉద్యోగులు అధికారులు ప్రతిరోజు నిద్రపోయే ముందు ప్రశ్నించుకోండి, ప్రభుత్వ ఉద్యోగం లభించడం అదృష్టం అది కొందరికే దక్కే అవకాశం, సామాన్య పౌరునికి సేవలు అందించి బాధ్యతగా ఉండాలి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉండాలి అన్నారు.

Also Read: Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

విద్యారంగంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు

మన బిడ్డలే రాష్ట్ర భవిష్యత్తు వారు ప్రపంచంతో పోటీ పడాలని ఆలోచనతో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం ఎదిగేందుకు 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం అన్నారు. మానవ సంపద సృష్టించడం కీలకం తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున సంపద సమకూరుతుంది అని డిప్యూటీ సీఎం వివరించారు. విలువైన మానవ సంపదను సృష్టించేందుకు విద్యారంగంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది అన్నారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం, న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా విద్యార్థులకు మంచి ఆరోగ్యం అందించి విలువైన మానవ వనరులు సృష్టించాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం

జిల్లా కలెక్టర్ మొదలు అధికారులు అందరూ విద్యాసంస్థలను పర్యవేక్షించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి ఈ కార్యక్రమం పక్కాగా జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏదైనా సంఘటన జరిగితే అందుకు ఇన్చార్జి అధికారిని బాధ్యునిగా చేస్తామని స్పష్టం చేశారు. గోదాముల్లో వస్తువులను కుక్కినట్టుగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను నమోదు చేసుకుంటున్నారు ఇకనుంచి ప్రైవేటు విద్యాసంస్థలకు ఉండాల్సిన అర్హతలు, సౌకర్యాలపై ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని అవన్నీ ఉంటేనే అధికారులు అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. సౌకర్యాలు లేని విద్యాసంస్థలను అప్గ్రేడ్ చేసుకోవాలని వెంటనే తెలియజేయండి వచ్చే విద్యా సంవత్సరానికి వారు ఆ రకంగా ఏర్పాటు చేసుకుంటారని డిప్యూటీ సీఎం అని తెలిపారు.

పెండింగ్ లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్

సంక్షేమ రంగంపై ప్రభుత్వం స్పష్టంగా ఉంది సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రతి మూడు నెలలకు బిల్లులు సిద్ధం చేసుకుని రాకపోతే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యాసంస్థల అద్దెలు, మెస్, కాస్మోటిక్స్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం అన్నారు. గిరిజనులకు సమగ్ర వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. అటవీ భూల హక్కుల చట్టం కింద భూములు పొందిన రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు, పంపుసెట్లు, డ్రిప్పు, ప్లాంటేషన్ సౌకర్యాలు కల్పిస్తాం అధికారులు ప్రతిపాదనలను వేగంగా పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకోవాలని గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.

Also Read: Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

Just In

01

CM Revanth Reddy: ‘కేటీఆర్.. నువ్వెంతా? నీ స్థాయి ఎంత?’.. సీఎం రేవంత్ వైల్డ్ ఫైర్!

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!