Deputy CM Bhatti Vikramarka (Image crediT: swetcha reporter)
తెలంగాణ

Deputy CM Bhatti Vikramarka: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు.. వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనం

Deputy CM Bhatti Vikramarka: ఆషాడ మాస బోనాల జాతరలో భాగంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం దేవాలయ పునరుద్ధరణ పనులకు రూ.1290 కోట్లు కేటాయించిందని అలాగే, హైదరాబాద్ (Hyderabad) సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ బోనాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడంతో రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు.

 Also Read: CM Revanth Reddy: ఘనంగా బోనాల ఉత్సవాలు.. అధికారులపై సీఎం ప్రశంసలు

అమ్మవారి ఆశీస్సులు ఉండాలి

ప్రభుత్వం భవిష్యత్తులో కూడా జరిగే బోనాల జాతరలను ఇంకా మెరుగైన రీతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి అలాగే , సింహవాణి మహంకాళి దేవాలయ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా గత జూన్ 26 నుండి (Hyderabad) హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల్లో ఎక్కడా కూడా ఎలాంటి అనుచిత సంఘటనలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖ అధికారులు నిబద్ధతతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా ముందుకు తీసుకువెళ్లాలని, ప్రభుత్వం ఒక విజన్ తో పని చేస్తున్నదని పేర్కొన్నారు. మరోవైపు, హైకోర్టు జడ్జి ఎస్ నంద సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

 Also Read: Illegal Constructions: పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్