Degree Lectures (imagecredit:AI)
తెలంగాణ

Degree Lectures: డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల మనోవేదన.. రెండేండ్ల నుంచి సెలవులు కట్!

తెలంగాణ: Degree Lectures: రాష్ట్రంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వేసవి ఎండలు మండుతున్నా సెలవులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్, రీ డిప్లాయిడ్, కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ అయిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చి డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు మాత్రం ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి రెండేండ్ల నుంచి తమకు ఎదురవుతోందని పలువురు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. అంతకుముందు సెలవులు యథావిధిగా ఉండేవని చెబుతున్నారు. విద్యార్థులు లేకుండా తాము కాలేజీలకు వెళ్లి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 121 డిగ్రీ కళాశాలల్లో దాదాపు 466 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు సెలవుల్లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా ఇబ్బందులు పడుతున్నట్లు లెక్చరర్లు చెబుతున్నారు. ఈ అంశంపై గతంలోనే ఉన్న అధికారులకు వినతులు సమర్పించామని, అయినా ఎలాంటి స్పష్టత రాలేదని వాపోయారు. రాష్ట్రంలో కేజీబీవీ, వెలుగు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు వేసవి సెలవులు ఇస్తున్నారని, కానీ కేవలం డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు మాత్రమే రెండు సంవత్సరాలుగా వేసవి సెలవులు ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇతర ఫ్యాకల్టీకి మే 1 నుంచి ఆనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

Also Read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!

ఈ సమస్యకు తోడు పలువురు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు అక్రమ దారిలో బ్యాక్ డేట్ తో పీహెచ్ డీ సర్టిఫికెట్ తెచ్చుకుని దాదాపు 42 మంది రెగ్యులర్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమండ్లు చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన 466 డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు, మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

పుండు మీద కారం చల్లినట్లు తీరు

రెగ్యులరైజేషన్ లో అన్యాయo జరిగి తీవ్ర మనస్థాపంతో ఉన్నాం. దానికి తోడు సెలవులు కూడా లేకపోవడంతో పుండు మీద కారం చల్లినట్టుగా మా పరిస్థితి మారింది. బానిస బతుకులుగా మారాయి. సెలవుల అంశంపై అధికారులను కలిసి వినతులు అందించాం. అయినా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికైనా మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపండి.
Also Read: CM Revanth On KCR: కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశారుగా!

 

Just In

01

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్

Hyderabad Task Force: రద్దయిన కరెన్సీ మార్పిడికి యత్నం.. గ్యాంగ్ అరెస్ట్ 1.92 కోట్లు సీజ్!

Karisma Kapoor: తండ్రి ఆస్తుల్లో వాటా కోసం ఢిల్లీ హైకోర్టులో కరిస్మా కపూర్ పిల్లలు దావా

Harish Rao: తెచ్చి చూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు ఛాలెంజ్

GHMC: ట్యాక్స్ చెల్లింపులో అక్రమాలకు చెక్.. భారీగా పెరగనున్న జీహెచ్ఎంసీ ఆదాయం!