CPI on BJP (imagecredit:swetcha)
తెలంగాణ

CPI on BJP: ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం.. చాడ వెంకటరెడ్డి

CPI on BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి(BJP) ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ(CPI)గా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూనేఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. నాడు హుస్నాబాద్ ‌లోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్‌లో సిపిఐ సిద్దిపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారని, రోజురోజుకీ దేశంలో పేదరికం పెరిగిపోతుందని అన్నారు. నరేంద్రమోదీ(Narendra Modi) ప్రభుత్వం దేశంలో పేద ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నారని మండి పడ్డారు. దేశంలో కార్మికుల హక్కులు కాలరాయ బడుతున్నాయని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మిక లోకాన్ని అభద్రతాభావంలోకి నెట్టివేశారని అన్నారు.

మావోయిస్టులు చర్చలకు సిద్ధం
మోడీ, అమిషాలు పూర్తిగా నియంతృత్వం పాలన కొనసాగిస్తున్నరని దుయ్యబట్టారు. బిజెపి ప్రభుత్వం నిత్యవసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపి పేద ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. అడవుల్లో ఉన్న ఖనిజ సహజ సంపదను విదేశీ సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోడీ, అమిత్ షా కుట్ర పన్ని, 2026 జనవరి చివరి వరకు నక్సలైట్లను పూర్తిగా అంతం చేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ అమాయక ఆదివాసీ, గిరిజనుల ప్రాణాలు తీస్తూ ధమనకాండ కొనసాగించారని, ఆదివాసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని దేశమంతా ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు, మేధావులు, ప్రజలంతా ముక్తకంఠంతో ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారని, తక్షణమే వారిని శాంతి యుత చర్చలకు పిలవాలని కోరుతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోందని అన్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

Also Read: Dammapeta mandal: గ్రామ పంచాయతీలను గాలికొదిలేసిన అధికారులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ బలం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు(Sambasiva Rao), కొంత మంది సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి మాట్లాడారని తెలిపారు. ఇప్పుడైతే సమన్వయంతో ఉన్నామని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చాక మాట్లాడుకుందామని ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి అన్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా, వారి ఆలోచన ఎలా ఉన్నా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ బలంగా ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ లుగా పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే చట్టసభల్లో అర్థం ఉంటుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ ఈ నెల16న సిపిఐ పార్టీ జిల్లా మహాసభలు హుస్నాబాద్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

Also Read: Big Folk Night 2025: జనజీవన గీతం జానపదం.. ఆగస్ట్‌లో స్వేచ్ఛ – బిగ్ టీవీ మెగా ఈవెంట్

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు