Harish Rao: కాళోజీ యూనివర్సిటీ అవినీతిపై గవర్నర్‌కి లేఖ
Harish Rao (imagecredit:twitter)
Telangana News

Harish Rao: కాళోజీ యూనివర్సిటీ అవినీతిపై గవర్నర్‌కి లేఖ రాసిన హరీష్ రావు

Harish Rao: కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం అత్యంత శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఇటీవలి కాలంలో ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని చెప్పారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాములకు చిరునామాగా మారడం దురదృష్టకరమని విమర్శించారు. విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.

పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిల్

కాళోజీ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, ఎన్‌ఎంసీ చైర్మన్‌కు హరీశ్ రావు గురువారం లేఖ రాశారు. వైద్య విద్య మార్కుల రీ వాల్యుయేషన్ ప్రక్రియపై కొద్ది రోజులుగా వరుసగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని, పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారేనని, వైస్ ఛాన్సలర్ ఆ కాలేజీలతో ఎన్ని కోట్ల రూపాయల డీల్ చేసుకున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. కాళోజీ యానివర్సిటీ స్కాం విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ నుంచి బదిలీ కోసం అధికారుల ప్రయత్నాలు.. కారణం అదేనా..!

రీ కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం

ఈ స్కామ్ వాస్తవాలు వెలుగు చూడకుండా, వీసీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని హరీశ్ రావు నిలదీశారు. రీ కౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ విశ్వవిద్యాలయ చరిత్రలోనే మొదటిసారి అని, ఇది నిబంధనల ఉల్లంఘనకు స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ నిబంధనలు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఈ అక్రమాలు జరగడం వైద్య విద్యా వ్యవస్థకు మాయని మచ్చగా పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం రీ కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందని, రీ వాల్యుయేషన్ చేయడం అనేది అక్రమమని తెలిపారు. పరీక్షలు ముగిసిన తర్వాత వైస్ ఛాన్సలర్ స్వయంగా సమాధాన పత్రాల్లోని క్రాస్ మార్క్ ఉన్న పేజీల్లో విద్యార్థులతో సమాధానాలు రాయించి, తిరిగి మూల్యాంకనం చేయించి, ఎక్కువ మార్కులు వేయించి ఐదుగురిని పాస్ చేయించారని అందులో ఒక విద్యార్థి విజిలెన్స్ విచారణలో స్పష్టంగా వెల్లడించాడని వివరించారు. పీజీ వైద్య పరీక్షలను సజావుగా నిర్వహించడంలో వైస్ ఛాన్సలర్ పూర్తి వైఫల్యం చెందారని, సమర్థవంతమైన అధికారులకు అవకాశం కల్పించకుండా రాజకీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వర్సిటీ ఖ్యాతి రోడ్డున పడిందన్నారు. ఈ మొత్తం తతంగంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు స్పష్టమవుతున్నదని హరీశ్ రావు అన్నారు.

Also Read: V.C. Sajjanar: పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. నిఘా నేత్రాలకు నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!