Telangana Ministers: రాష్ట్రంలోని నలుగురు మంత్రులు ఓ కారులో ప్రయాణించి, ప్రభుత్వ అధికారిక భవనంలో భేటీ అయినప్పటికీ వివాదస్పదం కావడం గమనార్హం. ఇందులో నలుగురు మంత్రులూ మొదట్నుంచి కాంగ్రెస్ వాదులు కావడం భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. పైగా సరిగ్గా సింగరేణి బొగ్గు టెండర్ల విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తున్న సమయంలోనే ఈ మంత్రుల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అంతేగాక సీఎం అమెరికా టూర్ నేపథ్యంలో ఈ సంఘటన జరగడం మీడియా, సోషల్ మీడియాలో హట్ హట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాస్తవానికి కేబినెట్ లో నలుగురు మంత్రులు ప్రభుత్వ అధికారిక భవనంలో కూర్చుంటే తప్పేమిటీ? అనే అంశాన్ని పక్కకు పెట్టి, ప్రతిపక్షాలు, సోషల్ మీడియా లు ఈ అంశాన్నీ కాంట్రవర్సీగా క్రియేట్ చేశాయి. సీఎం కుర్చీకి ఎసరు పెట్టేందుకే అంటూ కొందరు, హైకమాండ్ ఆదేశాల మేరకే భేటీ అంటూ ఇంకొందరు ..ఇలా రకరకాల కోణాల్లో ఈ ఘటనపై విస్తృత ప్రచారం చేశారు. తద్వారా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ అంశంపై ఏకంగా మంత్రులు ఖండించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంత్రులు కలిస్తే తప్పేమిటీ?
మంత్రులంతా అభివృద్ధి కోసమే కలిశామని డిప్యూటీ సీఎం వివరించారు. అంతేగాక మున్సిపల్ ఎన్నికల విజయం పై వ్యూహాలు చర్చించామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Srideer babu) కూడా ఈ ప్రచారాన్ని తప్పుపట్టారు. బహిరంగంగానే తాము ప్రజాభవన్ కు వెళ్తే, ఇందుకు ఇంత రాద్ధాంతం చేశారని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ కూడా మంత్రులు కలిస్తే తప్పేమిటీ? అంటూ ఖండించారు. జిల్లాలు సమన్వయం అంశాల్లో డిప్యూటీ సీఎంతో మంత్రులు భేటీ అయితే తప్పుడు ప్రచారం చేయడం సరికాదంటూ పీసీసీ చీఫ్ కూడా క్లారిటీ ఇచ్చారు.వాస్తవానికి సోమవారం లోక్‌భవన్‌లో జరిగిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నుంచి తిరుగు ప్రయాణం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్ది, అడ్లూరి లక్ష్మణ్ లు ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లారు. దీన్ని బీఆర్ ఎస్ సోషల్ మీడియా కొంత అత్యుత్సాహన్ని ప్రదర్శించి సీఎం వర్సెస్ మంత్రులు అనే స్థాయిలో చీత్రికరించి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా టూర్‌లో ఉండగా ఇలాంటి ప్రచారం జరగడం పొలిటికల్ సర్కిళ్లలో కూడా వివిధ రకాలుగా చర్చ జరిగింది.
Also Read: Medchal District: మున్సిపాలిటీ ఎన్నికలకు మోగిన నగారా.. నామినేషన్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
వింత అర్థాలు తీస్తున్న విపక్షాలు
ప్రజాస్వామ్యంలో సహచర మంత్రులు కలవడం సర్వసాధారణం అయినప్పటికీ, దీనికి రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని చూస్తున్న విపక్షాల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పరిపాలనాపరమైన అంశాలు, శాఖల మధ్య సమన్వయం ,అభివృద్ధి పనులపై చర్చించేందుకే అని మంత్రులు క్లారిటీ ఇచ్చినప్పటికీ, వింత అర్ధాలు తీస్తూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ కూడా ఘాటుగానే సమాధానం ఇస్తుంది. ఈ సాధారణ భేటీని పట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు సోషల్ మీడియాలో పెను తుపాను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిని మారుస్తున్నారని,అసమ్మతి గళం వినిపిస్తోందని తప్పుడు కథనాలను సర్క్యులేట్ చేస్తున్నారు. అధికారిక భవనంలో పారదర్శకంగా జరిగిన భేటీని ‘కుట్ర’గా చిత్రీకరించడం వారి పైశాచిక ఆనందానికి నిదర్శనమంటూ కాంగ్రెస్ మంత్రులు వివరిస్తున్నారు. ప్రజలను మిస్ లీడ్ చేయడమే లక్ష్యంగా ఈ తప్పుడు ప్రచారం సాగుతోందని వివరించారు. వాస్తవానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒకటి కావాలనే నినాదం తెరమీదకు వచ్చి ఉంటే, తప్పనిసరిగా కాంగ్రెస్ లోని చాలా మంది లీడర్లు ఈ భేటీలో కలిసేవారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మరి కొంత మంది పాత కాంగ్రెస్ నేతలు తప్పనిసరిగా భేటీ అయ్యేవారు. అంతేగాక ప్రభుత్వ భవన్ లో కాకుండా ప్రైవేట్ హోటల్ లేదా, ఇతర రహస్య ప్రాంతాల్లో భేటీ అయ్యేవారు.కానీ ఇలాంటి పరిస్థితులు ఏమీ లేకున్నా..బీఆర్ ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని తెరమీదకు తీసుకువచ్చిందనే విమర్శలు ఇప్పుడు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.
గతాన్ని గుర్తుచేస్తున్న సీనియర్లు
ప్రస్తుత పరిణామాలను చూసి రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు.కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అప్పట్లో కేబినెట్ మంత్రుల మధ్య చర్చలు, భేటీలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఊహాగానాలు వచ్చేవి, కానీ అవన్నీ పరిపాలనలో భాగమేనని తర్వాత తేలిపోయింది.అంతేగాక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, అప్పుడు విపక్షాలు చేసిన విమర్శలు ఏ విధంగా బెడిసికొట్టాయో సీనియర్లు ఉదహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పటిష్టంగా ఉన్నప్పుడు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఇక అభివృద్ధిని అడ్డుకోలేక విపక్షాలు చేస్తున్న మైండ్ గేమ్ ఇదని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్షంలో గందరగోళం సృష్టించి, లబ్ధి పొందాలనే విపక్షాల వ్యూహం పారదని మంత్రులు తేల్చి చెప్తున్నారు.
Also Read: Municipal Elections: ఎత్తుకు పై ఎత్తులు.. రసవత్తరంగా మారుతున్న మున్సిపల్ ఎన్నికలు

