Congress on BRS Party: వరంగల్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎటు చూసినా గులాబీ దండు కనిపిస్తోంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. మాజీ సీఎం కేసీఆర్ మాట ఏంటి అన్నదే ఇప్పుడు చర్చ. అయితే బీఆర్ఎస్ సభ గురించి తెలంగాణ కాంగ్రెస్ సంచలన ట్వీట్ చేసింది.
వరంగల్ బీఆర్ఎస్ సభకు ఎద్దుల బండ్లలో, కార్లలో, ఇతర వాహనాలలో పార్టీ శ్రేణులు వస్తున్నారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. వాడవాడనా కదలిరండి అంటూ బీఆర్ఎస్ గత కొద్దిరోజులుగా ముమ్మర ప్రచారం చేసింది. పార్టీ నాయకులు అందరూ సభను విజయవంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆ తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, ఎలాగైనా ప్రజల మద్దతు కూడబెట్టుకొనేందుకు అవస్థలు పడుతుందని విశ్లేషకుల అంచనా.
అయితే ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి సీటు దక్కించుకోలేదు. అందుకే పార్టీ పూర్వ వైభవం తెచ్చేందుకు ఈ సభను వాడుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. ఓ వైపు కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బలం పుంజుకోవాలంటే శ్రమించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
ఇదంతా అటుంచితే ప్రస్తుతం బీఆర్ఎస్ సభావేదికపై కెసిఆర్ మాటపైనే ఇప్పుడు చర్చ. అయితే ఇలా బీఆర్ఎస్ సభను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ కాంగ్రెస్ విమర్శలకు పదును పెట్టింది. ప్రతిపక్షంలో ఉండి వందల కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడివి అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ సభకు హాజరుకావాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ.. ఒకసారి ఈ బాటిల్ వైపు చూడండి.
రూ. 50 వేల కోట్లతో రూపొందించిన మిషన్ భగీరథ నీళ్లు ఇవేనా అని మీరే ఆలోచించండి. అంత కంటే ఎక్కువ ఖర్చు ఏ కంపెనీ వాడు పెట్టలే.. అంత భారీ ఖర్చు చేసినా, మిషన్ భగీరథ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. పనికి రాని ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను లక్షల సంఖ్యలో తెచ్చి.. ఎందుకు ప్రకృతి కాలుష్యాన్ని పెంచుతున్నారు? ఇంత ఖర్చు పెట్టి, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని చివరికి ఏ నీళ్ల బాటిల్ పెట్టారు అని ప్రశ్నించండి.
Also Read: Chamala Kiran Kumar: వందల కోట్లు ఎక్కడివి? బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి.. ఎంపీ చామల
అక్కడ నిజంగా మిషన్ భగీరథ పనిచేస్తుంటే, అక్కడ ఉన్న నీరు స్వచ్చమైన మిషన్ భగీరథ నీళ్లే ఉండేవి. ప్రశ్నించండి.. మీ సంపదను.. మీ భవిష్యత్తును.. ఎవరు దోచుకున్నారు..? అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కి బీఆర్ఎస్ సభ వద్ద కార్యకర్తలకు అందించే వాటర్ బాటిల్ ను ట్యాగ్ చేసి కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ కు బీఆర్ఎస్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచిచూడాలి.
సభకు హాజరుకావాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ…
ఒకసారి ఈ బాటిల్ వైపు చూడండి
50 వేల కోట్లతో రూపొందించిన మిషన్ భగీరథ నీళ్లు ఇవేనా అని మీరే ఆలోచించండి!
🔸అంత కంటే ఎక్కువ ఖర్చు ఏ కంపెనీ వాడు పెట్టలే
🔸అంత భారీ ఖర్చు చేసినా, మిషన్ భగీరథ లక్ష్యాన్ని సాధించలేకపోయారు.పని రాని… pic.twitter.com/9xyZqHu1TL
— Congress for Telangana (@Congress4TS) April 27, 2025