Anjan Kumar Yadav (imagecredit:twitter)
తెలంగాణ

Anjan Kumar Yadav: కొడుకు ఎంపీ అయితే నాకు టికెట్ ఇవ్వరా?: అంజన్ కుమార్ యాదవ్

Anjan Kumar Yadav: తన కొడుకు ఎంపీ(MP) అయితే తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వడం లేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్(Jublihills) అభ్యర్ధి ఎంపిక హైకమాండ్ నిర్ణయిస్తుందని, మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) అన్నారు. అయితే దాన్ని కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కంటే తానే సీనియర్ ను అని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌(Congress)లో సుదీర్ఘ కాలం పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009 సంవత్సరంలో హైదరాబాద్(Hyderabad) లోక్‌సభ నుంచి ఎంపీ(MP)గా గెలిచారు. 2014 తర్వాత కొంతకాలం పార్టీకి అంతర్గతంగా దూరంగా ఉన్నప్పటికీ, ఇటీవల మళ్లీ క్రియాశీలకంగా రాజకీయాల్లోకి మల్లీ వచ్చారు.

పార్టీ కోసం త్యాగం చేశా..

ప్రస్తుతం అంజన్ కుమార్ కుమారుడు అయిన అన్జన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) హైదరాబాద్(Hyderabada) ఎంపీ(MP)గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కోసం నేను పార్టీ కోసం త్యాగం చేశాను, కష్టపడ్డాను. నన్ను మీరు పక్కన పెడితే, అది నాకే కాదు, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టం అవుతుంది అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలు గా, ఎంపీలు గా ఎంతో మంది ఉన్నారని ఆయన వివరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Min Uttam Kumar Reddy), ఆయన భార్య పద్మావతి(Padmavathi), కోమటిరెడ్డి బ్రదర్స్(Komatireddy Brothers), డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క బ్రదర్స్(Bhatti Vikramaraka), మంత్రి వివేక్(Min Vivek) ఫ్యామిలీ ఇలా చాలా మంది ఒకే కుటుంబం నుంచి పదవులు పొంది ఉన్నారని వెల్లడించారు.

Also Read: Ganja Addiction: గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత.. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు

ఇవ్వడంలో ఏం అభ్యంతరం..

ఇంతమంది నాయకులు ఉండగా తనకు టిక్కెట్‌ ఇవ్వడంలో ఏం అభ్యంతరం అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీ బలంగా ఉండాలని గత సీఎం కేసీఆర్(KCR) మహముద్ అలీ(Mahumadh Ali)కి ఎమ్మెల్సీ(MLC) ఇచ్చి డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్(Home Minister) పదవులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నాయిని నర్సింహా రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ను చేశారన్నారు. హైదరాబాద్ లో పార్టీ బలంగా ఉండాలంటే తనలాంటి సీనియర్లకు అవకాశం ఇవ్వాలని అంజని కుమార్ యాదవ్ అన్నారు.

Also Read: Jogulamba Gadwal: మూగ జీవాల రోధన పట్టదా? మందుల కొరతతో జీవాల ఆరోగ్య క్షీణత

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..