Jubilee Hills (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

Jubilee Hills: బీఆర్ఎస్‌కు ఎర్రగడ్డ షేక్ పేట్‌ ఓటర్లు షాక్.. ఓట్లంన్నీ గల్లంతు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఓ రికార్డుగా చెప్పవచ్చు. నిజానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) ల గ్యాప్ ఏకంగా 10 శాతం ఉన్నట్లు రెండు పార్టీలు తమ ఇంటర్నల్ సర్వేల ద్వారా గుర్తించాయి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అత్యధికంగా ఉన్నది. కానీ సర్వేల ఆధారంగా ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తూ పోలింగ్ నాటికి ఏకంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ రాగా, రిజల్ట్స్ లో బీఆర్ స్ కంటే 13 శాతం ఓట్లను అధికంగా సాధించి ప్రత్యర్ధులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే ఈ ఉప ఎన్నికల్లోనే సుమారు 23 శాతం ఓట్ల షేర్ ను కాంగ్రెస్ తన ఖాతాలోకి భారీగా పెంచుకోవడం గమనార్హం. ఈ సంచలన విజయం వెనుక పార్టీ అనుసరించిన పక్కా వ్యూహాలు, మంత్రుల సమన్వయం కీలక పాత్ర పోషించాయి. ఇక కాంగ్రెస్ నాయకత్వం కేవలం ఎన్నికల ప్రచారంపై ఆధారపడకుండా, నియోజకవర్గంలో నిరంతరం నిర్వహించిన సర్వేలను తమ వ్యూహాలకు ఆధారంగా చేసుకుంది. అంతర్గత సర్వేల ద్వారా గతంలో ఏ ప్రాంతాల్లో ఓట్లు కోల్పోయారో స్పష్టంగా తెలుసుకున్నారు. బీసీ,ఎస్సీ వర్గాల ఓట్లు అధికంగా ఉండే డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి,వారి సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలైన మహాలక్ష్మి, చేయూత వంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేసి, మహిళా ఓటర్లను ఆకర్షించడంలో విజయం సాధించారు.

షేక్ పేట్..ఎర్రగడ్డలోనూ….

బీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉంటాయని భావించిన ఎర్రగడ్డ, షేక్ పేట్ డివిజన్లలోనూ కాంగ్రెస్ పర్మామెన్స్ ప్రదర్శించించడం గమనార్హం. ఇందులో బీఆర్ ఎస్ కు కోర్ ఏరియాగా భావించిన ఎర్రగడ్డకు సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహాకు ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. డివిజన్లలోని 50కిపైగా బూత్ లలో ప్రత్యేకంగా టీమ్ లను పెట్టి తనదైన శైలిలో క్యాంపెయిన్ నిర్వహించారు. రాజకీయాలపై స్పష్టమైన పట్టు, అవగాహన, అనుభవం కలిగిన నేతగా మంత్రి దామోదర బీఆర్ ఎస్ కు తనదైన శైలీలో చెక్ పెట్టారు. హంగు, ఆర్భాటం, అధికార దర్పం , ప్రతిపక్షాలపై విమర్శలు లేకుండా స్పష్టంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? చేయబోతుంది? గతంలో ఏం చేశాం? వంటి అంశాలపై స్థానిక బస్తీ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో యాస మార్చి ప్రచారం చేశారు. కాలనీలు, గల్లీలు, ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా ప్రచారం చేశారు. దీంతో బీఆర్ ఎస్ కు కీలక డివిజన్ గా ఉన్న ఎర్రగడ్డలో కాంగ్రెస్ కు 14,158 ఓట్లు (48 శాతం) రాగా, బీఆర్ ఎస్ 11,939(40) శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Also Read: Telangana BJP: ఎగ్జిట్ పోల్స్‌‌లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత..?

మంత్రుల పనితీరు..

ఇక షేక్ పేట్ లో మంత్రులు వివేక్(Vivek), కొండా సురేఖ(Konda Sureka)కు బాధ్యతలు అప్పగించారు. ఈ డివిజన్ లో కాంగ్రెస్ కు 48 శాతం, బీఆర్ ఎస్ కు 42 శాతం వచ్చాయి. వెంగళరావు నగర్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummalanageshwar Rao), వాకిటి శ్రీహరి(Vakiti Srihari)లు ప్రచారం చేయగా, ఇక్కడ కాంగ్రెస్ కు 52 శాతం, బీఆర్ ఎస్ కు 35 ఓట్లు వచ్చాయి. రహ్మత్ నగర్ లో మంత్రులు కోమటి రెడ్డి(Komati Reddy Venkat Reddy), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivass Reddy)లు ప్రచారం నిర్వహించగా, ఇక్కడ కాంగ్రెస్ కు 53 శాతం, బీఆర్ ఎస్ కు 38 శాతం ఓట్లు వచ్చాయి. సోమాజిగూడ డివిజన్ లో మంత్రులు శ్రీధర్ బాబు(Srideer babu), అడ్లూరి లక్ష్మణ్(Adlure Laxman)​ లు ప్రచారం చేయగా, కాంగ్రెస్ కు 51 శాతం, బీఆర్ ఎస్ కు 32 శాతం ఓట్లు రికార్డు అయ్యాయి. యూసప్ గూడ డివిజన్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) లు క్యాంపెయిన్ చేయగా, కాంగ్రెస్ కు 55 శాతం, బీఆర్ ఎస్ కు 34 శాతం ఓట్లు వచ్చాయి. అంతేగాక బోరబండలో మంత్రి సీతక్క(Min Seethak), ఎంపీ మల్లు రవి(MP Mallu ravi) ప్రచారం చేయగా, కాంగ్రెస్ కు 49 శాతం, బీఆర్ ఎస్ కు 41 శాతం వచ్చాయి. ఓవరల్ గా ముస్లీం మైనార్టీ ఓట్లలో 80 శాతం కాంగ్రెస్ కే వచ్చాయని ఆ లీడర్లు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Padmanabha Reddy: ఓవర్సీస్ విద్యా నిధిని పునఃపరిశీలించాలి.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ!

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!