Jupally Krishna Rao: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modhi) కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) అన్నారు. కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మనీ లాండరింగ్ కేసులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రానికి పూర్వం ప్రజలను చైతన్యం చేసేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డం పెట్టుకొని కేంద్రంలోని ప్రభుత్వం ఏఐసిసి నాయకులైన సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లపై అక్రమంగా కేసు నమోదు చేశారని అన్నారు. కోర్టు సంబంధం లేదని తీర్పు ఇచ్చినా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయడం అహంకార పాలనకు నిదర్శనమన్నారు. సోనియా, రాహుల్ గాంధీలకు ప్రధాని అవకాశం వచ్చినా ఒక విద్యావేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేసి త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
Also Read: India World Cup Squad: టీ20 వరల్డ్ కప్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. సంచలన మార్పులు
నరేంద్ర మోడీ ప్రభుత్వం
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చైతన్యం చేయాలని సూచించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ(MLA Vamshi Krishna), నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Dr. Kuchukulla Rajesh Reddy) ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read: KCR: నేడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్!

