Congress Govt( image credit: free pic)
తెలంగాణ

Congress Govt: రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ కోసం.. సాధ్యాసాధ్యాలపై కసరత్తు!

Congress Govt: ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ (Scholarship) బకాయిల భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. గత ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకపోవడంతో రూ.7500 కోట్లకు చేరుకుంది. దీంతో ప్రస్తుత ప్రభుత్వానికి సైతం ఈ పెండింగ్ భారం విపరీతమైంది. ఈ కారణంగా పలు యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టడంపై సర్కార్ సమాలోచనలు చేస్తోంది.

సర్కార్ పై ఈ భారం పడకుండా ఒక ప్రోగ్రామ్ ను రూపొందించే పనిలో ఉంది. దీనికోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. ఈ అంశంపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ పేరిట పలు ప్రైవేట్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం.

 Also Read: TG Tourism: టూరిజంపై మంత్రి స్పెషల్ ఫోకస్.. ఇప్పటికే కొంతమంది పనితీరుపై అసంతృప్తి!

సాధ్యాసాధ్యాలపై చర్చలు

ఒక బ్యాంకును ఏర్పాటు చేయాలంటే అంత సాధారణమైన విషయం కాదు. అందుకే బ్యాంకుగా అయితే ఎలా ఉంటుంది, ట్రస్ట్‌గా అయితే సాధ్యమవుతుందా, లేక ఏదైనా స్కీమ్‌గా అయితే బాగుంటుందా అనే అంశాలపైనా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ట్రస్ట్ ఏర్పాటు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం పేరిట ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ విధానంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా, అమలుపై పలు సందేహాలున్న నేపథ్యంలో సందిగ్ధతలో పడినట్లు సమాచారం. ఎందుకంటే వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏంటనే అంశంపై డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ట్రస్ట్ గా ప్లాన్ చేసి ఒక బాడీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా మొత్తం 18 మందితో కూడిన ఒక బాడీని ఏర్పాటు చేయడంపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా, ఆర్థిక మంత్రి జనరల్ సెక్రటరీగా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ట్రెజరీగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రైవేట్ యాజమాన్యాల చైర్మన్లు, వీసీలు ట్రస్టీలుగా ఉండేలా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ నివేదికలు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం.

100 శాతం ఐటీ మినహాయింపు ఇస్తే..

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ (Scholarship) బకాయిలు చెల్లించేందుకు కావాల్సిన నిధులను దాతల నుంచి విరాళాల రూపంలో అందుకుంటే బాగుంటుందనే ఆలోచనను ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. దీనికి 100 శాతం ఐటీ మినహాయింపు ఇస్తే భారీగా విరాళాలు వస్తాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నట్లు సమాచారం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) ఫండ్, పలు కార్పొరేషన్ల నుంచి ఫండ్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలా కనీసం రూ.1000 కోట్లకు పైగా నిధులను బ్యాంక్ లో జమవుతుందని భావిస్తున్నారు. తద్వారా ప్రస్తుత బకాయిలు తీర్చడంతో పాటు భవిష్యత్ లో విద్యారంగ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేందుకు సులువవుతుందనే యోచన దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

వన్ టైంగా జమ చేస్తే..

ఫండ్స్ జనరేట్ చేయడంలో తొలి ఆరేండ్లలో భాగంగా రాష్​ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ఇందులో భాగస్వామ్యమయ్యేలా సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఏడాదికి రూ.1500 కోట్ల భారం పడుతోంది. ఆ మొత్తాన్ని ఇందులో వన్ టైంగా జమ చేస్తే వాటికి విరాళాలు, కేంద్రం అందించే సబ్సిడీ స్కీమ్స్ నుంచి వచ్చే మొత్తం ద్వారా సులభంగా బకాయిలు తీర్చవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.

పేరుపైనా సమాలోచనలు

రాష్​ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే ఏం పేరు పెట్టాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ విద్యా మిషన్, రాజీవ్ గాంధీ శిక్షణ నిధి, సోనియాగాంధీ శిక్షణ నిధి ప్రయాస పేర్లను పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. చదువు, స్థిరపడు, చదివించు అనే నినాదంతో ముందుకు వెళ్లే అవకాశముంది. పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింద. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) స్టూడెంట్ బ్యాంక్, సోనియాగాంధీ స్టూడెంట్ బ్యాంక్, తెలంగాణ ఎడ్యుకేషన్ బ్యాంక్, తెలంగాణ విద్యా బ్యాంక్, రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ బ్యాంక్, సోనియా గాంధీ ఎడ్యుకుషన్ బ్యాంక్, ఇందిరాగాంధీ ఎడ్యుకేషన్ బ్యాంక్ పేర్లను పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా అమలులో ఉన్న సాధ్యాసాధ్యాలపైనే మరిన్ని సమావేశాల్లో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చే అవకాశముంది.

 Also Read: Seethakka on KTR: కేటీఆర్ నాశనమైపోతారు.. మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..