Ponnam Prabhakar (Image Source: Twitter)
తెలంగాణ

Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌

Ponnam Prabhakar: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం.. ఈ మూడింటికి కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవనానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డితో కలిసి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటోందని, ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

Also Read: Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్‌ ప్రకటన?

రేవంత్‌ సర్కార్‌ ఏర్పడ్డాక ఆర్టీసీ అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం తమ ప్రభుత్వ ఘనత అని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సౌకర్యార్థం భవనం నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. స్థలం విషయంలో ఎవరికైనా భూ పత్రాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. నగరానికి అతి చేరువలో ఈ భవన నిర్మాణం చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ సర్కార్‌ పేదల సర్కార్‌ అని అన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా రేవంత్‌ సర్కార్‌ ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read: Ram Charan: రామ్ చరణ్ వాళ్ళకి అంత బాధను మిగిల్చాడా.. గేమ్ ఛేంజర్ నిర్మాత సంచలన కామెంట్స్

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల అభివృద్ది కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్‌ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌ చారి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గుండ్లపల్లి హరితాధన్‌రాజ్‌గౌడ్‌, వేముల అమరేందర్‌ రెడ్డి, కంబాలపల్లి ధన్‌రాజ్‌, బండారి బాలరాజు, కాకుమాను సునీల్‌, వంగేటి గోపాల్‌ రెడ్డి, గుత్తా వెంకటరెడ్డి, వద్దిగళ్ల బాబు, బొక్క రవీందర్‌ రెడ్డి, వంశీధర్‌ రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌ అమరేందర్‌ రెడ్డి, డీఈ భిక్షపతి, ఏఈ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు