Home Guards (imagecredit:twitter)
తెలంగాణ

Home Guards: బదిలీలపై హోంగార్డుల ఆవేదన.. న్యాయం చేయాలని వేడుకోలు!

Home Guards: ఉద్యోగ భద్రతా లేదు. చాలి చాలని వేతనం అది పని చేస్తేనే వస్తుంది లేకుంటే లేదు. సెలవులు లేవు చాకిరి మాత్రం రికాం లేకుండా వెట్టి చాకిరీలా చెయ్యాల్సిందే. ఆరోగ్య భద్రత లేదు. రవాణా బత్తెం లేదు. సమస్యలపై అధికారులతో మాట్లాడితే ఉన్న ఉద్యోగం పోతుంది అనే భయం మరో వైపు. చాలీ చాలని గొర్రె తోకంత జీతంతో అనేక సమస్యలతో పోరాటం చేస్తూ బతికేస్తున్న హోమ్ గార్డులకు ఇప్పుడు అధికారులు చేపట్టిన బదిలీలు గుండెమీద రాయి వేసింతా పని చేస్తున్నాయి. కనీసం వారి విల్లింగ్ అడగకుండా వారి ఆరోగ్య ఆర్థిక భారం సమస్యలు పట్టించుకోకుండా చేపట్టిన బదిలీతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారి గోడు ఉన్నత అధికారుల ముందు వెల్లబిడుకుందామంటే ఉన్న నౌకరి ఉంటదా ? పోతుందా ? భయాందోళనకు గురి అవుతున్నారు. హోమ్ గార్డుల బదిలీలకు సంబంధించి వారు పడుతున్న ఆవేదనపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం.

చిన్న జీవుల బతుకులకు దూరం భారమే

ఉద్యోగ భద్రతా, ఆరోగ్య భద్రత, రవాణా బత్యం వంటివి ఏవీ లేకున్నా అరకొర జీతాలతో ఉన్న చోట ఉద్యోగం చేస్తూ బతికేస్తున్నారు హోమ్ గార్డులు. ఇప్పుడు వారిని సుదూర ప్రాంతం బదిలీ చేస్తే వారికి ప్రయాణం భారంగా మారుతుంది. ప్రయాణం చేయకుండా నౌకరి చేసే చోట కుటుంబంతో సహా అద్దె ఇంట్లో ఉండమంటే అది తీవ్ర వారికి తలకు మించిన భారం అవుతుందనే ఆందోళనలో హోం గార్డులు పడ్డారు. పని చేస్తేనే వచ్చే చిన్న బతుకులైన మాకు దూరం బదిలీ చేయడం అంటే మా బతుకులతో చెలగాటం ఆడడమే అని హోమ్ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతే మా ఉన్న నౌకరి ప్రశ్నార్థకంగామారే ప్రమాదం ఉందనే భయాందోళనతో అధికారుల ముందుకు రావడానికి హోంగార్డులు జంకుతున్నారు.

Also Read: GHMC Employees: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు .. అందని ద్రాక్షగా పదోన్నతులు!

ఇతర జిల్లాలకు బదిలీలు

ఎక్కువ పని దినాలలో, చాలి చాలని జీతాలున్న విధుల నిర్వహణలో ముందుండే హోంగార్డు కుటుంబాల బదిలీల ప్రస్తావన వచ్చిన నాటి నుంచి భయంతో విల వించాడుతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, రామగుండం జిల్లా, వరంగల్ జిల్లా, సిద్ధిపేట జిల్లాల పరిధిలో పనిచేస్తున్న 337 మంది హోమ్ గార్డులను మే 28న చేసిన బదిలీతో వారి కుటుంబాల పరిస్థితి అస్తవ్య స్తంగా తయారైంది. గతంలో హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు నుండి పైకి మాత్రమే జోనల్ కింద పరిగణించి పక్క జిల్లాలకు బదిలీ చేసేవారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా కనీసం వారి విల్లింగ్ తీసుకోకుండ చేపట్టిన బదిలీలు హోంగార్డులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. ఈ బదిలీలలో ఔట్ ఫీల్డ్ లో పని చేసే వారిని విల్లింగ్ అడిగి కూడా పరిగణలోకి తీసుకోకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేసి, ఆఫీసులో పనిచేసే వారి విషయంలో రాజకీయ పరమైన పైరవీలతో ఆపినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వం పెంచింది 79 రూపాయలు మాత్రమే

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది హోంగార్డులను ఒకేసారి బదిలీ చేయడం వెనుక అంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2014 ముందు వారి జీతం రూ.9వేలు ఉండేది. గత ప్రభుత్వం హయాంలో వారి సేవలను గుర్తించి మొదట 12 వేలు, తర్వాత 20 వేలు, ఆ తర్వాత 27 వేలుగా పెంచాగా ప్రస్తుత ప్రభుత్వం 79 రూపాయలు మాత్రమే పెంచింది అరకోర జీతాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న తమ జీవితాల మీద ప్రస్తుత బదిలీ తీవ్ర ప్రభావం పడతాయని హోమ్ గార్డులు ఆందోళన చెందుతున్నారు. వారి పిల్లల్ని స్థానిక స్కూళ్లలో, కాలేజీల్లో చేర్పించారు. కానీ ఈ బదిలీతో కుటుంబాలతో సహా బదిలీ అయినచోటికి వెళ్లాలంటే వారి ఇంటిఅద్దె, స్కూల్స్ వారికి ఇతరత్రా ఖర్చుల విషయంలో తీవ్రభారంగా మారుతాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే పెద్ద మనసుతో మా బాధలను గమనించ బదిలీలతో మాకు ఉన్న సమస్యలను గుర్తించి మా అభిప్రాయం మేరకు బదిలీలు చేపట్టాలని హోంగార్డులు కోరుతున్నారు.

Also Read: Swetcha Effect: నకిలీ విత్తనాల దందాపై.. స్పందించిన ప్రభుత్వం!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్