Raksha Bandhan: అందరూ కాదు కానీ, కొందరు సివిల్ సర్వెంట్లు నిజంగా చాలా ఆదర్శవంతంగా ప్రవర్తిస్తుంటారు. వారి నిబద్ధత, ప్రజలపట్ల ఉన్న బాధ్యతాయుత వైఖరి ఎంతోమందిలో ప్రేరణ నింపుతుంది. రాత్రింబవళ్లు పనిచేస్తూ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంటారు. సమూలంగా వ్యవస్థను మార్చలేకపోవచ్చు, కానీ, మంచిని ప్రోత్సహిస్తూ, తమ స్థాయిలో మార్పును సాధ్యం చేస్తుటారు. ప్రజల మనసుల్లో ప్రభుత్వ సేవలపై గౌరవాన్ని పెంచుతుంటారు. అలాంటి కోవకే చెందిన ఐఏఎస్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి. విధి నిర్వహణలో నిబద్ధతో వ్యవహరించే ఆమె శనివారం రక్షా బంధన్ సందర్భంగా (Raksha Bandhan) స్వీట్స్ తీసుకొని నగరంలోని శిశువిహార్‌కు వెళ్లారు. పిల్లలందరికీ రాఖీలు కట్టి స్వీట్లు, చాక్లెట్లు, డ్రాయింగ్ బుక్స్ అందించి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. దీంతో చిన్నారులు మురిసిపోయారు.
Read Also- Inspirational Story: 9వ తరగతిలో చదవు మానేసి.. నేడు ఊహించని స్థానంలో ఉన్నాడు
కలెక్టర్ హరిచందనకు ముద్దుముద్దు మాటలు చెబుతూ రాఖీలు కట్టారు. దీంతో, హరిచందన కూడా ఆనందపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోదర భావం, ఆప్యాయతకు రాఖీ పండుగ ప్రతీక అని వ్యాఖ్యానించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా చిన్నారులు అందరికీ సమయానికి నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలో ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు జూ పార్క్ చూపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పిల్లలతో మమేకమైన కలెక్టర్ హరిచందన వివిధ దేశాలకు సంబంధించిన అన్ని జాతీయ జెండాలని చూపించారు.
Read Also- GHMC: టార్గెట్ నెలకు రూ.100 కోట్లు… జీహెచ్‌ఎంసీ కీలక ప్రణాళిక!
శిశువిహార్ సందర్శనలో భాగంగా, పిల్లల నుంచి వివరాలు రాబట్టేందుకు హరిచందన ప్రయత్నించారు. ప్రపంచ పటంలోని వివిధ దేశాల పేర్లను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలను ఆమె అభినందించారు. అనంతరం శిశు విహార్ లో పిల్లల వివరాలు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు, ఆట వస్తువులు తదితర అంశాలపై సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో కలెక్టర్ తో పాటు సీడీపీఓ సంతోషి, ఈఓలు సవిత, తస్లీమా, నర్స్ అలివేలు, టీచర్లు, ఆయాలు సిబ్బంది పాల్గొన్నారు.
జనగామ కలెక్టర్‌కు చిన్నారి రాఖీ
జనగామ, స్వేచ్ఛ: రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పండుగను సందడిగా జరిగింది. అక్కలు, చెల్లెళ్లు, అన్నయ్య, తమ్ముళ్ల సందళ్లతో ఇళ్లు కళకళ్లాడాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి మురిసిపోయారు. ఇక, జనగామ జిల్లా కలెక్టరు షేక్ రిజ్వాన్ భాషాకు ఓ చిన్నారి రాఖీ కట్టి స్వీట్ తినిపించింది. కలెక్టర్ కూడా ఆ చిన్నారికి స్వీట్ తినిపించి, ఆశీర్వదించారు.
Read Also- 334 Parries Removed: 334 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం