CM Revanth Reddy(image credit:X)
తెలంగాణ

CM Revanth Reddy: చెక్ డ్యాంల నిర్మాణంతోనే సరిపెడ్తారా? నిధులు ఇవ్వాలని రైతులు, ప్రజల డిమాండ్!

CM Revanth Reddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 23న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు, చేయడానికి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు, డిమాండ్ చేస్తున్నారు.

జహీరాబాద్ రైతాంగానికి గుండె కాయ, నారింజ ప్రాజెక్టు అభివృద్ధికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి సరిపడా నిధులు మంజూరు చేయాలని ఆ ప్రాంత రైతాంగం సీఎం కు విన్నవిస్తున్నారు ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛ నారింజ ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తే, ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతం మొత్తం పంట పొలాలు, పచ్చగా ఉండి, పసిడి రాశులు పండుతాయి అన్నది ఆశగా ఎదురుచూస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తుండడంతో రైతులు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. నారింజ ప్రాజెక్టును మినీ ట్యాంక్ బండ్ గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజల రైతులు కోరుతున్నారు.

నారింజ ప్రాజెక్టు దిగువన చెక్ డ్యామ్ ల ఏర్పాటుకు 17కోట్లతో ప్రతిపాదనలు

Also read: Minister Seethakka: టీచర్లకు ఏడాదికి రెండుసార్లు శిక్షణ.. మంత్రి కీలక నిర్ణయం!

5.79 కోట్ల అభివృద్ధి పనులకు త్వరలో టెండర్ల

ఎంపీ ఎన్నికల ముందు మంజూరైన చెక్ డ్యాంల నిర్మాణాలకు సంబంధించి పనులకు అనుమతులు లభించినట్లు తెలుస్తుంది. చెక్ డ్యాంల నిర్మాణాలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పిలవనున్నారు. వీటిలో న్యాల్కల్ మండలం చెనిగే పల్లి గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణానికి 1.09 కోట్లు, హుమ్నపూర్ గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి ఒక కోటి, చీకుర్తి గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి 68 లక్షలు, ఝరాసంగం మండలం కుడిసంగం వాగుకు అడ్డంగా చెక్ డ్యాం నిర్మాణానికి 67.70 లక్షలు, జహీరాబాద్ మండలం మల్చల్మా గ్రామంలో 75.80 లక్షల రూపాయలతో మరో చెక్ డ్యాం నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించునున్నారు.

Also read: Yash Mother Pushpa: యష్‌తో నేను సినిమాలు చేయను.. ఎందుకంటే?

కాగా ఈ నెల 19 న రాయికోడ్ మండలం బొగ్గులం పల్లి ఎత్తి పోతల పథకానికి కొనసాగింపుగా 87.10 లక్షల రూపాయల పనులకు గాను టెండర్ ఆహ్వానించినట్లు ఇరిగేషన్ కార్యనిర్వహక ఇంజనీర్ విజయ్ కుమార్ తెలియజేశారు. ఇదిలా ఉండగా జహీరాబాద్ మండలం నారింజ ప్రాజెక్ట్ దిగువ నీటి కింద నాలుగు చెక్ డ్యాం ల నిర్మాణం కోసం 17.09 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే వీటికి కూడా టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభీంచనున్నారు.

జహీరాబాద్ నియోజకవర్గంకు ఊపిరి అయిన నారింజ ప్రాజెక్టు అభివృద్ధి చెందితే పంటపొలాలు పచ్చగా ఉండి రైతులు సంతోషంగా ఉండగలుగుతారు. నారింజను మినీ ట్యాంక్ బాండ్ గా మార్చి టూరిజంగా అభివృద్ధి చేయాలన్నది ఇక్కడి ప్రజల కోరిక. అందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నారు. ఈ నెల 23న సిఎం జహీరాబాద్ వస్తునందున నారింజ కు వరాలు కురిపించాలని రైతులు కోరుతున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?