Govt Employees: త్వరలో ప్రత్యేక సమావేశానికి సీఎం గ్రీన్ సిగ్నల్
అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీ
ఉద్యోగ సంఘాల సమస్యలకు చెక్
పాజిటివ్ సందేశాన్ని పంపిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల (Govt Employees) పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కొత్త ఏడాది కానుకగా ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలత వ్యక్తం చేశారు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వ సానుకూలత ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ కాలంగా కోరుతున్న కీలక అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్ధo కావడం పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పంపిన ఈ సానుకూల సందేశం ఉద్యోగ వర్గాల్లో మనోధైర్యాన్ని నింపింది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పాలననుమరింత వేగవంతం చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా సంక్రాంతి లోపే కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం.
Read Also- Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమవుతుందా?.. తాజా పరిస్థితి ఏంటంటే?
కీలక అంశాలు ఇవే….
జీహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం చేసిన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటి అద్దె రాయితీని 24 శాతానికి పెంచాలన్న డిమాండ్‌పై చర్చించేందుకు సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్ లను వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలను పటిష్టంగా అమలు చేయడం, ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవులు, ఇతర పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.1,500 కోట్లు చొప్పున కేటాయించడం వంటి అంశాలపై డిస్కషన్ చేయనున్నారు. దీనితో పాటు ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ, ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడంపై కూడా ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. అంతేగాక సుదీర్ఘ కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ల ప్రక్రియను పట్టాలెక్కించడం వంటి వాటిపై కూడా చర్చించనున్నారు.
Read Also- Harish Rao: జర్నలిస్టులను విడదీసే.. రెండు కార్డుల విధానం సరికాదు.. హరీష్ రావు ఆగ్రహం
వైద్య శాఖ సమస్యలకు పరిష్కారం చూపండి…డాక్టర్ కిరణ్ మాదాల…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యుల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని టీచింగ్ హాస్పిటల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కిరణ్ మాదాల చీఫ్ సెక్రటరీ కి ప్రత్యేక లేఖ రాశారు. 2016 నుండి యూ జీ సీ పీ ఆర్ బకాయిలను 36 విడతలుగా చెల్లించేందుకు 2024లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనీ గుర్తు చేశారు. అయితే తమ సభ్యులలో చాలామంది 21 బిల్లులు సమర్పించినప్పటికీ, ఎక్కువ మందికి ఇప్పటివరకు కేవలం 3-4 విడతలే జమ అయినట్లు తెలిపారు.ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణనలోకి తీసుకొని మిగిలిన బకాయిలను వేగంగా విడుదల చేయవలసిందిగా కిరణ్ మాదాల కోరారు.ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన నాలుగు డీఏ సవరణల బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయయన్నారు. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.2 లక్షల వరకు ఈ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. అంతేగాక అనేక మంది వైద్యులకు సీ పీ ఎస్ క్రెడిట్లు కేవలం సుమారు 70 శాతం మాత్రమే జమ అయినట్లు తెలిపారు.ముఖ్యంగా 2024 సంవత్సరానికి సంబంధించినవి , 2020కు ముందు సంవత్సరాల క్రెడిట్లు పూర్తిగా జమ కాలేదన్నారు. కావున, మిస్సింగ్ సీ పీ ఎస్ కంట్రిబ్యూషన్లను వెంటనే సమీక్షించి ఖాతాల్లో జమ చేయాలన్నారు. మరోవైపు పార్ట్ జీ పీ ఎఫ్, సీ పీ ఎస్ లను కూడా అత్యంత ప్రాధాన్యతతో వీలైనంత త్వరగా క్లియర్ చేయాలన్నారు.

