CM Revanth Reddy(image credit: swetcha reporter)
తెలంగాణ

CM Revanth Reddy: జ‌హీరాబాద్‌లో ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ!

CM Revanth Reddy: జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్రమంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రి గోయ‌ల్‌తో రేవంత్ రెడ్డి (Revanth Reddy)  భేటీ అయ్యారు. జ‌హీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమ‌లు ట్ర‌స్ట్ ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని కోరారు.

 Also Read:Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష!

స్మార్ట్ సిటీతోపాటు..

స్మార్ట్ సిటీకి అవ‌స‌ర‌మైన నీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఆర్థిక స‌హాయం చేయాల‌ని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే, హైద‌రాబాద్‌, (Hyderabad) వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యానికి నిధులు మంజూరు చేయాల‌ని అభ్య‌ర్ధించారు. హైద‌రాబాద్‌, (Hyderabad) విజ‌య‌వాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు గోయల్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆదిభ‌ట్ల‌లో అత్యున్న‌త‌మైన మౌలిక వ‌స‌తుల‌తో ప్ర‌త్యేక‌మైన ర‌క్ష‌ణ‌, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసింద‌ని ఈ నేపథ్యంలో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు పారిశ్రామిక కారిడార్‌ను ఏరో డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాల‌ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజ్ఞ‌ప్తి చేశారు.

మ‌ద్ద‌తుగా నిల‌వాలి

పెట్టుబ‌డుల‌కు సిద్ధంగా ఉన్న వంద ప్ల‌గ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పిస్తామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం వాటికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (క్రీడ‌లు) ఏపీ జితేంద‌ర్ రెడ్డి, (Jitender Reddy) ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, కేంద్ర ప‌థ‌కాల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 Also Read: Seethakka on KTR: కేటీఆర్ నాశనమైపోతారు.. మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్