CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Minister Rajnath Singh), రైల్వే, ఐటీ & సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Minister Ashwini Vaishnav), కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్(Minister Manohar Lal Khattar)ని విడివిడిగా కలుసుకుని హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
ప్రధాన లక్ష్యాలు
గ్లోబల్ సమిట్‌లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యాలు మరియు ప్రాధాన్యత అంశాలను కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్ట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
Also Read: Mahabubabad Crime: తల్లితో అక్రమ సంబంధం.. కూతురుపై అత్యాచారం.. బయ్యారంలో షాకింగ్ ఘటన
