CM Revanth Reddy: నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన
CM Revanth Reddy (Image Source: Twitter)
Telangana News

CM Revanth Reddy: నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.532 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించారు. రూ.532.24 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో రేవంత్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నర్సంపేటలో అడుగుపెట్టిన సీఎంకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు.

శంకుస్థాపన పనుల వివరాలు

నర్సంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి పునాది వేశారు. రూ.82.56 కోట్లతో హన్మకొండ-నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులు ప్రారంభం రూ.17.28 కోట్లతో నర్సంపేట- పాఖాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ. 56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. రూ. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణం, రూ. 20 కోట్లతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు.

బీఆర్ఎస్‌పై ఫైర్

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విపక్ష బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. గత పదేళ్ల కాలంలో భారీగా ఆస్తులను సంపాదించారు గానీ.. ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఉద్యమ గడ్డ వరంగల్ కు ఏమాత్రం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఆనాడు కేసీఆర్ వరి వేసుకుంటే ఉరేనని అన్నారని.. కానీ తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి ప్రోత్సహాకాలు అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఏపీ కంటే రెండింతలు వరి ఇక్కడే పండుతోందని రేవంత్ గుర్తుచేశారు. మరోవైపు వరంగల్ లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ అన్నారు.

Also Read: Vladimir Putin: ఫుడ్ బాగుంది.. మై డియ‌ర్ ఫ్రెండ్‌.. మోదీపై పుతిన్ పొగ‌డ్త‌లు వింటే..

ఓయూపై సీఎం సమీక్ష

అంతకుముందు ఓయూ యూనిర్శిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఇప్ప‌టికే ఉన్న జ‌ల వ‌న‌రుల‌ను సంర‌క్షిస్తూనే నూత‌న జ‌ల వ‌న‌రుల ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. హాస్ట‌ల్‌, అక‌డ‌మిక్ భ‌వ‌నాల నిర్మాణం విష‌యంలో వంద మంది విద్యార్థులుంటే అద‌నంగా మ‌రో ప‌ది శాతం విద్యార్థుల‌కు వ‌స‌తులు ఉండేలా చూడాల‌ని తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భ‌విష్య‌త్తులోనూ ఎటువంటి అసౌక‌ర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాల‌ని సీఎం అన్నారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని చారిత్ర‌క, వార‌స‌త్వ భ‌వ‌నాల‌ను సంర‌క్షించాల‌ని చెప్పారు.

Also Read: Mega Parents-Teachers Meeting: స్కూళ్లకు వెళ్లిన చంద్రబాబు, పవన్.. విద్యార్థులతో మాటామంతి.. ఆపై కీలక వ్యాఖ్యలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?