CM Revanth Reddy: ట్రిపుల్ ఐటీ కళాశాల శంఖుస్థాపన చేసిన సీఎం
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News, మహబూబ్ నగర్

CM Revanth Reddy: తెలంగాణలో మరో బాసరగా.. ట్రిపుల్ ఐటీ కళాశాలకు శంఖుస్థాపన చేసిన సీఎం..!

CM Revanth Reddy: వలసల జిల్లా పాలమూరును విద్యా హబ్‌గా మార్చడమే తమ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revantth Reddy) పునరుద్ఘాటించారు. సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట జడ్చర్ల మండల పరిధిలోనీ చిట్టేబోయిన్ పల్లిలో 600 కోట్లతో నిర్మించబోయే ట్రిపుల్ ఐటీ కళాశాల(Triple IT College)కు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన మీరు ముఖ్యమంత్రి స్థాయి ఎదిగిన విజయ ప్రస్థానాన్ని గురించి వివరించమని అడగ్గా.. తన విజయానికి ప్రధాన కారణం లక్ష్యాన్ని నిర్దేశించు కోవడం ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో కష్టాలేన్నీ ఎదురైన వెరవకుండా అంతకన్నా రెట్టింపు కసితో లక్ష్యం వైపు సాగిపోవడం అన్నారు.

దేశ మొదటి ముఖ్యమంత్రి నెహ్రూ..

2006లో తాను జెడ్పీటీసీగా గెలుపొంది ఆ తదనంతరం ఎమ్మెల్(MLC)సీగా, ఎమ్మెల్(MLA)యే గా, ఎంపీ(MP)గా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా దేశంలోని అన్ని చట్ట సభల్లో తను పనిచేశానని చెప్పుకొచ్చారు. మనిషి జీవిత గమనానాన్ని మార్చేది కేవలం విద్యా మాత్రమే అని విద్యా ఏ ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని తాను ముందుకెళ్తున్నట్లు తెలిపారు. భారత దేశ మొదటి ముఖ్యమంత్రి నెహ్రూ ఈ దేశంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లకు ప్రథమ ప్రాధాన్యతఇచ్చారని, ఆయన స్పూర్తితోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో 200కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రిపుల్ ఐటీ నీ మహబూబ్ నగర్‌లో నెలకొల్పమాన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి యంపీ డీకే అరుణ(DK Aruna) , ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ విజేయిందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Medaram Jatara 2026: మేడారంకు పోటెత్తిన భక్తులు.. ఓరి నాయనా ట్రాఫిక్‌తో కల్లుచెదిరేలా నిలిచిపోయిన వాహనాలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంఘం

బూర్గుల రామకృష్ణా రావు తరవాత మహబూబ్ నగర్ జిల్లాకు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాకు విద్యా, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాం విద్యా మన సమస్యలకు పరిష్కారం చూపుతుందని, భాషను మెరుగు పరుచు కోవాలిన అన్నారు. జీవితంలో పై కి రావాలంటే పట్టుదలతో కష్టపడి పనిచేయాలి. అచ్చంపేట నియోజక వర్గం మారుమూల పల్లె నుంచి వచ్చిన నేను 17 ఏళ్ల లో ముఖ్యమంత్రి అయ్యాను. మంత్రి కాకపోయినాఅందరి సహకారంతో సీఎం అయ్యాను. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నే రాష్ట్రాని ముందుకు తీసుకు వెళ్ళుతున్నామని అన్నారు. గతంలో భూమి లేని నిరుపేదలకు ఆదివాసి గిరిజన దళితులకు భూములు పంచారు. ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా భూమి లేదు. విద్యా ఒక్కటే మార్గం మనకు.. విద్యలో రాణినించాలని అన్నారు. చదువే సమాజం లో గౌరవం తీసుకువస్తుందని, సివిల్స్‌కు హాజరయే వారికి కూడా ఆర్ధిక సహాయం చేస్తున్నాంమని అన్నారు. ఏడాదిలో ఐఐఐటీ భవనం సిద్ధం చేస్తాం తల్లి తండ్రులను అందరూ గౌరవించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: Jhansi Incident: ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. వీడియో వైరల్!

Just In

01

AP Politics: వరుసగా ప్రారంభాలు, శంకుస్థాపనలు.. ఏపీలో వైసీపీ ముఖచిత్రం ఏంటో?

Rangareddy Congress: రంగారెడ్డి జిల్లాలో విచిత్ర రాజకీయం.. అధిష్టానం ఆదేశాలను లెక్కచేయని జిల్లా నేతలు

AR Rahman: ముస్లిం అయిన మీరు ‘రామాయణ’కు ఎందుకు వర్క్ చేస్తున్నారని అడిగితే..

MLA Daggupati Prasad: హీటెక్కిన ఏపీ రాజకీయం.. వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే.. లేడీ డాక్టర్‌పై దౌర్జన్యం!

Khammam News: ఖమ్మం జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. ఈసారి మేయర్ పదవి మళ్లీ..?