Medaram Jatara 2026: ప్రచంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారంకు భక్తులు పోటెత్తారు. కొందరు భక్తులు ముందస్తు మొక్కులతో వస్తున్నారు. దీంతో మేడారం ప్రాంతం అంతా జనసంద్రంగా మారిపోయింది. వన దేవతల గద్దెల పరిసరాల మేడారానికి వేలాదిగా వాహనాలు తరలి వస్తున్నాయి. దీంతో ములుగు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జకారం నుండి మేడారం వరకు భారీగా వాహనాల రద్దీ ఎర్పడింది. చింతల్ క్రాస్ వద్ద 3 కిలోమీటర్ల మేర భక్తుల వాహనాలు నిలిచిపోయాయి. గుడికి వెల్లే వెంగళపూర్(Vengalpur) నుండి నార్లాపూర్(Narlapur) వరకు దాదాపుగా ఓక 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్ధతం అక్కడ మేడారానికి దాదాపుగా 4 లక్షపై చిలుకు భక్తులు వచ్చినట్టు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
సుమారు మూడు కోట్ల మంది భక్తులు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా పర్వంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ ఏర్పాట్లన్నిటిపై నిత్యం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది. భక్తుల సౌకర్యం, సుభిక్ష దర్శనం ప్రథమ ప్రాధాన్యతగా మారింది. సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పని చేసేలా నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Mahabubabad News: మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలో.. ప్రభుత్వం పై బీసీ నేతలు గుర్రు..!
2 వేల మంది ఆదివాసీ యువత
ఈ జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం, పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు. మోబైల్ నెట్ వర్క్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్దతిలో 33 మోబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా, 42 సెక్టర్లుగా విభజించారు. ఒక్కో జోన్ కు జిల్లా స్థాయి అధికారి ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. ఒక్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారి భాద్యతలు నిర్వర్తిస్తారు.
42 పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం
ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నర్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూములు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మత్తులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నిరంతం తాగు నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,482 తాగు నీటి నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు శుద్ధమైన నీటిని అందిస్తున్నారు.
మేడారంకు పోటెత్తిన భక్తులు
ముందస్తు మొక్కలతో జనసంద్రంగా మారిన వన దేవతల గద్దెల పరిసరాలు
మేడారానికి వేలాదిగా తరలివెళ్తున్న వాహనాలు
ములుగు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర ట్రాఫిక్ జామ్
జకారం నుండి మేడారం వరకు వాహనాల రద్దీ
చింతల్ క్రాస్ వద్ద 3 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు… pic.twitter.com/2ClABJlSnS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2026
Also Read: Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

