CM Revanth Reddy: నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని రేవంత్ రెడ్డి హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల విచారణలో వున్న కేసు కొట్టవేయాలంటూ ఆయన కోరారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ప పార్టి ఎన్నికల సభ నిర్వహించింది. అయితే సభలో రేవంత్ రెడ్డి ప్రసంగంపై పరువు నష్టం దావాను బిజెపి ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వేశారు.
కాంగ్రెస్ బహిరంగ సభలో బిజెపి పరువు నష్టం కలిగించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని ఫిర్యాదుచేశారు. కాసం వెంకటేశ్వర్లు క్రిమినల్ పిటిషన్ ను నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారించింది. విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రసంగించారని బిజేపి అభ్యర్ధి కాసం వెంకటేశ్వర్లు అన్నారు.
Also Read: Dubbaka Lands: పేదోళ్ల భూముల్లో దొరల పాగా! భూ భారతి వచ్చినా మారని తీరు!
కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కోర్టుకు కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని పిటిషన్ లో రేవంత్ రెడ్డి కోరారు. తదుపరి విచారణ నిర్వహించకూడదని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని మధ్యంతర ఉతర్వులివ్వలని పిటిషన ను రేవంత్ రెడ్డి కోరారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/