Cm Revanth: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చెల్లని రూపాయిలాంటోడని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఓ పిచ్చొడని… ఏదేదో మాట్లాడతారని మండిపడ్డారు. కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రికోడుకులు ఇద్దరికి బలుపు తప్ప ఏమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా మాట్లాడటంలో ఇద్దరు ఇద్దరేనన్నారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతే ప్రతిపక్షాలు సంతోషిస్తున్నాయన్నారు. అఖిల పక్షం మీటింగ్ పెడితే… ప్రతిపక్షాలు రాలేదని గుర్తుచేశారు. తెలంగాణ(Telangana)తో బీఅర్ఎస్ వాళ్లకు సంబంధం లేదు కాబట్టి సమావేశానికి రాలేదన్నారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) సికింద్రాబాద్ లో ఉండి కూడా రాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది బీజేపీ నేతలే అని మండిపడ్డారు. మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతామని చెప్పారు. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు మెట్రో తెచ్చానని అంటున్నారని, అది ఎక్కడుందో చెప్పాలని ఎద్దేవా చేశారు. జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రోనే ఇంకా ఉందని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ పూర్తి చేయాల్సిన భాద్యత కేంద్రానిదని పునరుద్ఢాటించారు. బట్టి పిలిస్తే బీజేపీ నాయకులు డుమ్మా కొట్టారని, ఆరోజు కిషన్ రెడ్డి గారు బీజీగా ఉంటే, మరీ కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ సమావేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాకపోతే 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని సీఎం తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకుంటానన్నారు. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను పరిష్కరించుకొని వచ్చినట్లు చెప్పారు. కుల గణన ప్రభావంతోనే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తున్నాయన్నారు.
కాగా, అంతకుముందు ఇవాళ ఉదయం ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha venkanna) సైతం కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూడా పరిశ్రమలు వస్తున్నాయి.. తెలంగాణ రావడం లేదంటూ కేటీాఆర్ అంటున్నారని.. తమ రాష్ట్ర మంటే అంత చిన్న చూపా అంటూ మండిపడ్డారు. ఆయనవి అన్ని వెకిలి చేష్టలు, వెకిలి మాటలుగా వుంటాయని తీవ్రంగా విమర్శించారు. తమ నాయకుడు చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
Also Read:
Budda venkanna: కేటీఆర్ వి వెకిలి మాటలు… వెకిలి చేష్టలు- ఏపీ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు