Budda venkanna: కేటీఆర్(KTR) ఏపీని అవమానిస్తున్నారని ఏపీ(AP) టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న(Budda Venkanna) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయి.. తెలంగాణా రాలేదు అంటూ తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూసేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పినా కేటీఆర్‌కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదన్నారు. తమ నాయకుడు చంద్రబాబు(CM Chandrababu naidu) అరెస్టు(Arrest) సమయంలో కూడా ఇలాగే వాగారని గుర్తు చేశారు. అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే వెకిలిగా మాట్లాడారని, పక్క రాష్ట్రంలో చేసుకోండి అంటూ హేళన చేశారని అందుకే బీఆర్ ఎస్ ప్రభుత్వం కుప్పకూలిందని విమర్శించారు. ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోవడానికి కేటీఆర్ వెకిలి చేష్టలే కారణమన్నారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన కేటీఆర్ మాకు నీతులు చెప్పేవాడా అంటూ మండిపడ్డారు. ‘‘ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. తెలంగాణాలో బీఆర్‌ఎస్(Brs)కు దిక్కు లేదు.. మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు.
Borugadda: జైలు నుంచే బోరుగడ్డ కాన్ఫరెన్స్ కాల్స్… అధికారుల ఫుల్ సపోర్ట్
ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని.. ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి తమ రాష్ట్రానికి వస్తాయన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే.. వంద దేశాల్లో నిరసనలు చేశారని.. అది ఆయన స్ఠామినా అని తెలిపారు. చంద్రబాబు పాలన పై జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందని తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఏదో వాగారని.. ఆయన గొప్పతనం తగ్గదన్నారు. ‘చంద్రబాబు గురించి.. నీకు తెలియదేమో.. మీ నాన్నకు తెలుసు’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రవర్తన మార్చుకోపోతే సిరిసిల్ల(Sirisilla)లో కూడా గెలవరని హెచ్చరించారు.