Chief Commissioner: నూతనంగా బాధ్యతలు తీసుకోబోయే మహిళా గ్రామ పరిపాలన అధికారులకు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. కొత్తగా రెవెన్యూ శాఖలోకి వచ్చే జీపీవోలకు సొంత నియోజకవర్గాలు దాటిన తర్వాతనే పోస్టింగ్ లుఇవ్వాలని ఇటీవల భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ ఆర్డర్స్ లో మహిళా ఆఫీసర్లకు చిక్కులు ఏర్పడ్డాయి. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇవ్వడం వలన సతమతమవుతామనే భయం ఆయా ఉద్యోగుల్లో ఉన్నది.
Also Read: IBPS RRB Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 13,217 పోస్టులు..
సుమారు 1500 మంది మహిళా ఆఫీసర్లు
5 వేల మంది జీపీవోలకు ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఇందులో సుమారు 1500 మంది మహిళా ఆఫీసర్లు ఉన్నట్లు సమాచారం. వీరికి సొంత నియోజకవర్గాల్లో పోస్టింగ్ లు ఇవ్వకపోతే సమస్యలు ఎదుర్కొంటారని రెవెన్యూ యూనియన్లు చెబుతున్నాయి. కుటుంబాలకు దూరంగా ఉంటూ కొత్త సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. మనవతా దృక్ఫథంతో ఉమెన్ అభ్యర్ధులకు రెవెన్యూ డివిజన్, సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత మండలం కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని మహిళా అభ్యర్ధులు కోరుతున్నారు.
కమిషనర్ ఇచ్చిన సర్క్యూలర్ వలన తమకు దూర ప్రాంతాల్లో పోస్టింగులు ఇస్తారనే ఆందోళనలో అభ్యర్ధులు ఉన్నారు. మహిళా అభ్యర్ధులను కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉన్నదని వీఆర్ వో రీ డిప్లైయిడ్ అసోసియేషన్ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ సైతం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు లేఖ రాశారు. మహిళలకు ఇబ్బందులు లేకుండా పోస్టింగ్ లు ఇవ్వాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ఫస్ట్ ఫేజ్ లో వాళ్లకే ప్రయారిటీ..?
గ్రామాల్లో రెవెన్యూ సేవలు సమర్ధవంతంగా అందించేందుకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారులను నియమించబోతున్నది. ఫస్ట్ ఫేజ్ లో గతంలో వీఆర్వోలు, వీఆర్ ఏలుగా పనిచేసిన వారికి ప్రయారిటీ ఇచ్చి, ఎగ్జామ్ ను కూడా నిర్వహించారు. మెరిట్ లోని 5 వేల మందికి ఈ నెల 5న హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ లో అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీని వలన ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం మరింత సమర్ధవంతంగా అమలవుతుందనేది సర్కార్ భావన. ఈ కేడర్ నియామాకానికి ప్రభుత్వం పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ ఉన్నాధికారులు, ప్రజలు తదితర కేటగిరీల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. అన్ని వర్గాల నుంచి సంపూర్ణంగా ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే జీపీవోల నియామకానికి చర్యలు చేపట్టింది.
సమన్వయంలో కీ రోల్..?
గ్రామ పరిపాలన ఆఫీసర్లు గ్రామాల్లో కీ రోల్ పోషించనున్నారు. ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు లబ్దిదారులను గుర్తించడం వంటివి నిర్వహించనున్నారు. అంతేగాక ఎన్నికల విధులు, ఆఫీసర్లు, ప్రొటోకాల్ సహకారం, ఇతర ప్రభుత్వ శాఖలతో గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో సమన్వయం వంటివి చేయనున్నారు. దీంతో పాటు గ్రామ పద్దుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలకు ప్రాథమిక విచారణ, ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల ఆక్రమణలపై విచారణ, భూ వివాదాల దర్యాప్తు, భూముల సర్వేలో సర్వేయర్లకు సహకారమందించడం వంటి విధులు నిర్వర్తించనున్నారు.మరోవైపు ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవడం, అత్యవసర సర్వీసులందించడం వంటి టాస్క్ లు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు ఇచ్చే ఉత్వర్వులు, ఆదేశాలు, సూచనలను ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది.
Also Read: GST Revamp: బిగ్ అలెర్ట్.. ఇప్పుడే ఆ వస్తువులు కొనొద్దు.. ఈ నెల 22 నుంచి చీప్‌గా వస్తాయ్