Sukma Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ ఎన్‌కౌంటర్ల పరంపరను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆదివారం సుక్మా జిల్లాలో బెజ్జి, చింతగుఫా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ పోలీసుల కథనం ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు ఉన్నారు. వీరిలో జనమిలీషియా కమాండర్, స్నిపర్ స్పెషలిస్ట్, ఏరియా కమిటీ సభ్యుడు అయిన మాద్వి దేవ, సీఎన్‌ఎం కమాండర్ పోడియం గంగి, కిస్టారం ఏరియా కమిటీ సభ్యుడు (ఇన్‌ఛార్జి సెక్రెటరీ) అయిన సోడి గంగి ఉన్నారు.
Also Read: Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు
మావోయిస్టు పార్టీ అంతమే లక్ష్యం..
కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్‌ను చేరుకునే దిశగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చురుకైన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లి, మావోయిస్టులపై మూకుమ్మడిగా, బలమైన ప్రణాళికతో దాడులు చేస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఎదురుకాల్పుల్లో అత్యధికంగా మావోయిస్టులు మృతి చెందుతుండగా, కేంద్ర భద్రతా బలగాలు ఈ పోరులో పూర్తి పట్టు సాధించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే సుక్మా జిల్లాలో తాజాగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
Also Read: Illegal Constructions: ఉమ్మడి రంగారెడ్డిలో ఫామ్ ల్యాండ్ వ్యాపారం.. పట్టించుకోని అధికారులు
