Chenetha Runa Mafi
తెలంగాణ

Chenetha Runa Mafi: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

Chenetha Runa Mafi: చేనేత రంగం కూదేలు కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. వారికి సబ్సిడీపై రుణాలు ఇస్తూ మరోవైపు కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుంది. బ్యాంకులో రుణాలు తీసుకున్నవారికి మాఫీ చేసి వారిని ఆర్ధికంగా ఆదుకునే చర్యలకు శ్రీకారం చుట్టింది. రుణమాఫీకి ఇప్పటికే రూ.33కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అందుకు ఎవరెవరూ అర్హులు అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా రుణాలు తీసుకున్నవారి లిస్టును జిల్లాల వారీగా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనేవారికి రుణమాఫీ చేయబోతున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్న చేనేత రంగమే. ఆరంగం ప్రస్తుత టెక్నాలజీతో కూలేదు అవుతుంది. నేతన్నలు ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి కొనసాగిస్తున్నాయి. వారికి మరింతగా చేయూత నిలవాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వ్యక్తిగత రుణాలులక్ష వరకు తీసుకున్నవారికి మాఫీ చేయాలని భావించి అందుకోసం ఉత్తర్వు 56ను జారీ చేసింది.

అంతేకాదు 33కోట్లు విడుదల చేసింది. అయితే ఎంతమంది అర్హులు అని జిల్లాల వారీగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 లోపు ఉన్న చేనేత కార్మికులందరికీ రుణమాఫీ చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో 5691 మంది రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, వారి సమగ్ర అభివృద్ధి చేనేత అభయహస్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 10న రూ.168 కోట్ల నిధులతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. నేతన్న చేయూత పథకం ద్వారా రూ.290.09 కోట్లు విడుదల చేసి, 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చారు. టెస్కోకు రూ.494.48 కోట్లు విడుదల చేసి, చేనేత సహకార సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ, మాక్స్ సంస్థలకు పెండింగ్ చెల్లింపులు చేశారు. నేతన్న బీమా పథకం కింద 10 లక్షల బీమా కల్పిస్తూ, వయోపరిమితిని తొలగించి, నేతన్న వృత్తిలో ఉన్నంతకాలం బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.

పవర్‌లూమ్ యజమానుల(ఆసామీ) దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్ 5న వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో స్థాపించారు. ఇందుకోసం రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేశారు. మరోవైపు చేనేత రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ, స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకునేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ ని స్థాపించి, ప్రతి ఏడాది 60 మంది విద్యార్థులకు మూడేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు.

Also Read: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

లక్ష రుణమాఫీ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైతం అధికారులతో ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే రుణమాఫీకి సంబంధించిన లేఖలను అందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చేనేత రంగంను ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసాను కల్పించబోతున్నారు. ఇదెలా ఉండగా గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిలపైనా చర్యలు చేపట్టారు. చేనేతవస్త్రాలను అన్ని ప్రభుత్వశాఖలు కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చేనేత రంగం బలోపేతానికి దోహదపడనున్నాయని పలువురు చేనేత కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీని త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?