NHM Funds: నేషనల్ హెల్త్ మిషన్ నిధులలో కేంద్రం అలసత్వం!
NHM Funds (imagecredit:twitter)
Telangana News

NHM Funds: నేషనల్ హెల్త్ మిషన్ నిధుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం!

NHM Funds: ప్రజారోగ్య రంగానికి వెన్నెముకగా నిలిచే నేషనల్ హెల్త్ మిషన్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. గడిచిన పన్నెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే,రాష్ట్రానికి రావాల్సిన వాటాలో కేంద్రం భారీగా కోత విధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.ముఖ్యమంత్రి స్వయంగా రెండుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా, నిధుల విడుదల విషయంలో స్పష్టత రాకపోవడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో బడ్జెట్ సంక్షోభం నెలకొన్నది.2014 నుంచి 2026 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.8936.11 రావాల్సి ఉండగా, కేవలం రూ.7249 మాత్రమే రిలీజ్ చేసినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే రూ. 878.05 కోట్ల నిధులు మురిగిపోయినట్లు అధికారులు చెప్తున్నారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు ఆ నేషనల్ హెల్త్ మిషన్ పెండింగ్ నిధుల కొరకు కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాలేదని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆర్ధిక సమస్యతో సతమతమవుతున్న రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉన్నది.

కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచే…?

తెలంగాణ లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేంద్రం నుంచి నిధులు విడుదలకు కాస్త బ్రేకులు పడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో పవర్ లో ఉన్నందున పొలిటికల్ కోణంలో నిధులను పెండింగ్ పెడుతూ వస్తున్నారని గతంలో తెలంగాణ ఎంపీలు విమర్శించారు. రాష్ట్ర మంత్రుల సైతం నిధులు కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. ఎన్ హెచ్ ఎం నిధులు కోసం ఆరోగ్యశాఖ పలుమార్లు సెంట్రల్ గవర్నమెంట్ కు ప్రపోజల్స్ పంపించింది. కానీ పెండింగ్ లోని డబ్బులు రిలీజ్ చేయలేదు. వాస్తవానికి ఎన్ హెచ్ ఎం కార్యక్రమాల్లో సెంట్రల్ 60 శాతం, స్టేట్ 40 శాతం భరించాల్సి ఉంటుంది. కానీ సెంట్రల్ షేర్ నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో ప్రస్తుతం వంద శాతం స్టేట్ బడ్జెట్ తోనే నెట్టుకువస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగానే చేసినా ,యుటిలిటీ సర్టిఫికెట్లను సమర్పించినా..నిధులు బ్రేక్ కావడం గమనార్హం.

Also Read: SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

ప్రతీ ఏటా పెరుగుతున్న లోటు.

తెలంగాణ ఏర్పడకముందు కేంద్రం రాష్ట్రం షేర్ 75:25 నిష్పత్తిలో ఉండేది. 2015–16 నుంచి అది 60:40 నిష్పత్తికి మారింది. అయితే, ఈ నిష్పత్తి ప్రకారం రాష్ట్రం తన వాటాను సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ, కేంద్రం మాత్రం కేటాయించిన బడ్జెట్ లో కోత విధిస్తోంది. రాష్ట్రం షేర్ తో నిధులు సరిపోక ఆరోగ్యశాఖలో ఇబ్బందులు నెలకొన్నాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో మ్యాచింగ్ గ్రాంట్ సర్దుబాటు చేయడం రాష్ట్రానికి భారంగా మారుతోంది.దీంతో ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్లకు నిధులు,ఉద్యోగులకు జీతాలు, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశ వర్కర్లు ఇన్సెంటీవ్ లన్నీ ఆగిపోయాయి.ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, మందుల కొనుగోలు, సిబ్బంది వేతనాలు ,మౌలిక సదుపాయాల కల్పనపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాక మెటర్నల్​హెల్త్ అండ్​న్యూట్రిషన్​,చైల్డ్​హెల్త్ అండ్​ఇమ్యూనైజేషన్​,డయాగ్నస్టిక్​సర్వీసెస్​,వెల్ నెస్​సెంటర్లు(పల్లె దవాఖాన్లు),టెలీ మెంటల్​హెల్త్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, ఎన్ సీడీ కిట్లు పంపిణీ, మలేరియా, టీబీ వ్యాధుల నియంత్రణ, క్వాలిటీ అసెస్​మెంట్, స్టాఫ్​రిక్రూట్​మెంట్, ఆర్​బీఎస్​కే, ఐడీఎస్పీ, తదితర కార్యక్రమాలన్నీంటికీ బ్రేక్​పడే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

నేషనల్ హెల్త్ ఫండ్స్ కేంద్రం షేర్, రాష్ట్రానికి వచ్చినవి ఇలా( కోట్లలో)

సంవత్సరం కేంద్రం షేర్ వచ్చినవి పెండింగ్
2014–15 507.48 378.66 128.82
2015–16 498 448.48 49.52
2016–17 434 398.58 35.42
2017–18 465.31 381.53 83.78
2018–19 764.03 713.4 50.63
2019–20 1026 991.39 34.61
2020–21 747.88 671.87 76.01
2021–22 825.48 725.67 99.81
2022–23 856.04 683.83 172.21
2023–24 888.13 564.4 323.73
2024–25 938.42 1114.91 (–176.49)
2025–2026 985.34 176.5 ప్రాసెస్

Also Read: Kohli Rohit: వారెవ్వా.. శతక్కొట్టిన రోహిత్, విరాట్.. దేశవాళీ క్రికెట్‌లోనూ పరుగుల వరద

Just In

01

Akhanda 2 JajiKayi Song: బాలయ్య బాబు ‘అఖండ 2’ నుంచి ‘జాజికాయ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

Hydraa: పతంగుల పండగకు.. చెరువులను సిద్ధం చేయాలి.. హైడ్రా కమిషనర్ ఆదేశాలు

Anasuya Bharadwaj: వివక్షపై మరోసారి గళం విప్పిన అనసూయ.. “నా ఉనికిని తక్కువ చేసే ప్రయత్నం చేయకండి”

iPhone Auction: తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశం.. బెంగళూరులో భారీ గ్యాడ్జెట్ వేలం

Telangana BJP: బీజేపీ దూకుడు.. త్వరలో స్పోక్స్ పర్సన్ల నియామకం.. తెరపైకి రేషియో విధానం!