MP DK Aruna (imagecredit:twitter)
తెలంగాణ

MP DK Aruna: వెనుకబడిన జిల్లాల జాబితాలో.. తెలంగాణ నుండి 4 జిల్లాలు..ఇవే అవి?

MP DK Aruna: ప్రధానమంత్రి ధన, ధాన్య కృషి యోజన కింద వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో వెనుకబడిన జిల్లాల జాబితాను కేంద్రం రిలీజ్ చేసినట్లు పాలమూరు ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) తెలిపారు. ఆస్పిరేషనల్ అగ్రికల్చర్ జిల్లాలుగా దేశంలోని మొత్తం 100 పేర్లతో కూడిన జాబితాలో ఉమ్మడి పాలమూరుకు చెందిన 3 జిల్లాలు ఉన్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని మొత్తం 100 జిల్లాలు ఎంపిక చేస్తే.. తెలంగాణ నుంచి 4 జిల్లాల ఎంపికైనట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరుకు చెందిన నారాయణపేట(Naryanapeta), గద్వాల(Gadwal), నాగర్ కర్నూల్(Nagarkarnul) జిల్లాలతో పాటు జనగామ జిల్లా ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు.

కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు..

కాగా ఈ జిల్లాలకు రాబోయే ఆరేండ్ల వరకు వ్యవసాయ అవసరాలకు, పనిముట్లకు, యంత్రాలు, మిషనరీ, ఇతర అవసరాలకు భారీగా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని ఆమె తెలిపారు. పాలమూరు ప్రజల తరుపున కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదములు తెలిపారు. ఇదిలా ఉండగా బీబీనగర్(BB Nagar) ఎయిమ్స్(AIMS) లో స్వస్త్ నారీ-స్వశ‌క్త్ ప‌రివార్‌ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి డీకే అరుణ హాజరయ్యారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును పర్యవేక్షించారు. ఎయిమ్స్ బోర్డు మెంబర్ గా నియామకమైన అనంతరం ఆమె తొలి స‌మావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో కొన‌సాగుతున్న వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టుల వివ‌రాల‌పై ఆరాతీశారు.

Also Read: Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన ఆరు ఎస్టీపీలు.. మరో 39 కొత్త ఎస్టీపీలకు శంకుస్థాపన

ఈ ప్రోగ్రాం కింద..

అనంతర అరుణ మాట్లాడుతూ.. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టిసారించాలన్నారు. మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ క్యాంప్ లు కొనసాగుతున్నాయన్నారు. ఇందులో చేసే టెస్టులు బయట చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం కింద ఉచితంగా టెస్టులు చేయిస్తున్నట్లు చెప్పారు. నిరుపేదలందరికీ ఉచితంగా, తక్కువ ఖర్చుతో ట్రీట్ మెంట్ అందించడబు ఎయిమ్స్ లక్ష్యమని అరుణ వ్యాఖ్యానించారు. మరికొన్ని నెలల్లో బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయిలో అన్నిరకాల వైద్య సదుపాయలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.

Also Read: Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!

Just In

01

MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!

Jupally Krishna Rao: గోల్ఫర్లు ప్రీమియర్ గమ్యస్థానంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

RV Karnan: బిల్డ్ డౌన్ టీడీఆర్‌లకు.. కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు!