Buddhavan: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం
Buddhavan (imagecredit:twitter)
Telangana News, నల్గొండ

Buddhavan: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మెరవనున్న బుద్ధవనం.. అందుకు ప్లాన్ ఇదే..!

Buddhavan: స్వదేశీ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆధ్యాత్మిక, విద్యా, పర్యాటక కేంద్రంగా బుద్ధవనాన్ని అభివృద్ధి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు. శనివారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. నల్గొండ(Nalgonda) జిల్లాలోని వాడపల్లి కృష్ణా, మూసీ నదుల సంగమ క్షేత్రంలో ఉన్న వీరనారాయణ స్వామి పుణ్యక్షేత్రానికి కార్తీక మాసం, ఇతర పండుగ సమయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ఆధ్యాత్మిక, పర్యాటక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులు, పర్యాటకులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పన కోసం ఫీజిబులిటీ సర్వేను ప్రతిపాదించినట్లు వివరించారు.

పర్యాటక ప్రాజెక్ట్..

నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన బౌద్ధ వారసత్వ, సాంస్కృతిక పర్యాటక ప్రాజెక్ట్ అని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా నది తీరాన సుమారు 274 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్, నాగార్జున కొండ, ఆచార్య నాగార్జున బౌద్ధ వారసత్వాన్ని కలిగి ఉందని వివరించారు. బుద్ధవనంలో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్(Digital Experience Center) ఏర్పాటుకు కేంద్ర పర్యాటక శాఖ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ. 24.84 కోట్లు మంజూరు చేసిందని, ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదనంగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో బౌద్ధ మఠం, ధ్యాన కేంద్రం, విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, పుణ్యక్షేత్ర, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జూపల్లి ఉద్ఘాటించారు.

Also Read: Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం.. మధ్యప్రదేశ్‌లో 200 చిలుకల మృతి

బీఆర్ఎస్ మొసలి కన్నీరు

రైతన్నకు సాగునీరు అందించడం కంటే నిధులు, కమిషన్లపైనే బీఆర్ఎస్ ప్రభుత్వం మక్కువ చూపిందని కృష్ణారావు ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కమిషన్లు, అడ్డగోలు సంపాదనపై ఉన్న ధ్యాస కృష్ణా నదీ పరివాహక ప్రాంత సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చూపలేకపోయారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని అంగీకరించడం వారి వైఫల్యానికి నిదర్శనమని ఎత్తి చూపారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులపై చూపిన ప్రేమ ఉమ్మడి పాలమూరు- రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులపై చూపలేదని జూపల్లి విమర్శించారు. నీటిపారుదల కోసం రూ. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినా, పాలమూరు ప్రాజెక్టులకు మాత్రం అన్యాయం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం టెండర్లలో కాంపిటిటివ్ బిడ్డింగ్ జరిగి ఉంటే రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఆదా అయ్యేదని స్పష్టం చేశారు. పనులు పూర్తి కాకుండానే ఎన్నికల లబ్ధి కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ఏ ఒక్క ప్రాజెక్టును వారు పూర్తి చేయలేకపోయారని చెప్పారు. కృష్ణా జలాల చర్చలో తమ అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ సభకు దూరంగా ఉందని జూపల్లి ఆరోపించారు.

Also Read: Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు

Just In

01

IPL-Bangladesh: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ ఆదేశాలు

Road Safety: పాఠశాల విద్యార్థుల భద్రత డ్రైవర్లదే: ఇన్‌స్పెక్టర్ కంచి వేణు

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Gas Leakage: కోనసీమలో అలజడి.. ఓన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు

TG Medical Council: మెడికల్ కౌన్సిల్, సర్కార్ మధ్య వివాదం.. చిచ్చు పెట్టిన జీవో 229.. అసలు కారణం అదేనా?