NVSS Prabhakar: తెలంగాణలో బీఆర్ఎస్ – బీజేపీ ఒకటేనంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. బీజేపీపై పెద్దగా విమర్శలు కూడా చేయకపోవడం ఇందుకు నిదర్శమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తేదీల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతోందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతోందంటూ జోస్యం చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ (CM Revanth Reddy) స్థానంలోకి కేసీఆర్ వస్తారని ఆయన ఆరోపించారు.
Also Read: Arunachal Pradesh: చైనా ఓవరాక్షన్.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్.. డ్రాగన్‌తోనూ తగ్గేదేలే!
కమ్యూనిస్టులపై ఆగ్రహం
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవమంతమైందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) పేర్కొన్నారు. ఇది ఇకపైనా కొనసాగుతుందని తెలిపారు. అటు కమ్యూనిస్టులకు దేశంలో కాలం చెల్లిందన్న ఆయన.. తీవ్రవాదులపై వారు కంటి తుడుపు చర్య అవలంభిస్తున్నారని చెప్పారు. బీజేపీని బూచిగా చూపించడమే కమ్యూనిస్టులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు సైతం ‘భారత మాతకి జై’ అనాలని పట్టుబట్టారు. కాలం చెల్లిన కమ్యూనిజానికి దేశంలో స్థానంలేని ఆగ్రహం వ్యక్తం చేశారు.