Sudigali Sudheer: అదిరిపోయే న్యూస్ చెప్పిన సుధీర్ ఫ్యామిలీ!
Sudigali Sudheer (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Sudigali Sudheer: అదిరిపోయే న్యూస్ చెప్పిన సుధీర్ ఫ్యామిలీ.. త్వరలో మనకి పరిచయం చేయబోతున్నాడా?

Sudigali Sudheer: బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న యాంకర్లలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన సుధీర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. అదే సమయంలో హీరోగా మారి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. అయితే 30 దాటిన సుధీర్ కు పెళ్లి కాలేదు. దీనికి తోడు జబర్ధస్త్ యాంకర్ రష్మీకి సుధీర్ కు మధ్య ఏదో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ ఇంట శుభకార్యం జరగడం నెట్టింట వైరల్ మారింది.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ సంబురాల్లో మునిగిపోయింది. సుధీర్ ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే దీనికి కారణం సుధీర్ సోదరుడు రోహన్. రోహన్ కు రమ్య అనే యువతిలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వారికి ఓ పాప కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆ జంట తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రోహన్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు. దీంతో సుధీర్ కుటుంబంలో వారసుడు వచ్చాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుధీర్ కు శ్వేత అనే సోదరి ఉంది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోంది.

Also Read: Cricketer Retirement: టీమిండియాకు బిగ్ షాక్.. మరో స్టార్ క్రికెటర్ గుడ్ బై!

సుడిగాలి సుధీర్ సినిమాల విషయానికి వస్తే.. 2015లో ‘వేర్ ఇజ్ విద్యాబాలన్’ మూవీతో అతడు వెండితెరపై అడుగుపెట్టాడు. 2019లో వచ్చి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీతో హీరోగా మారాడు. జబర్దస్త్ టీమ్ మేట్స్ గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తో కలిసి ‘త్రీ మంకీస్’ అనే ఫిల్మ్ సైతం చేశాడు. ఆ తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’ వంటి సినిమాల్లోనూ సుడిగాలి సుధీర్ హీరోగా నటించాడు. అయితే అవేమి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీలో సుధీర్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు.

Also Read This: Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు మామూలోడు కాదు.. బాధితుడి ఆవేదన

Just In

01

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం