Telangana Local Body Elections
తెలంగాణ

Telangana Local Body Elections: సీపీఎం వైపు గులాబీ చూపు.. ‘స్థానిక’పొత్తు పొడిచేనా?

* మునుగోడు బైపోల్, అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ హ్యాండ్
*గుర్రుగా ఉన్న సీపీఎం నేతలు
*కాంగ్రెస్‌తో కలిసేందుకు ఖమ్మం, నల్లగొండ నేతల మొగ్గు?
*ఇప్పటికే కలిసొచ్చే పార్టీతో ముందుకెళ్తామన్న సీపీఎం రాష్ట్రకమిటీ
*సీపీఐ మాత్రం బీఆర్ఎస్‌కు ఇప్పటికే దూరం!

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుతో వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సిద్ధమవుతున్నది. అందుకోసం ఇప్పటికే కమ్యూనిస్టు నేతలతో ఒక దఫా సంప్రదింపులు చేయగా, మరోసారి చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మెజార్టీ సీట్లపై దృష్టిసారించిన గులాబీ నేతలు.. పొత్తులతో కాంగ్రెస్ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే సీపీఐ (CPI) నేతలు కాంగ్రెస్ (Congress), సీపీఎం (CPM)లతో కలిసి పోయేందుకు సిద్ధమయ్యారు. సీపీఎం సైతం పొత్తుపెట్టుకోవాలని భావిస్తుంది. ఏ జిల్లాల్లో బలంగా ఉంటే ఆ పార్టీతో పొత్తుతో వెళ్తామని సీపీఎం ప్రకటించింది. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సీపీఎంలోని కీలక నేతలు గులాబీతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read- Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు నిఘా కమిటీలు? ముఖ్య నాయకులతో మీనాక్షి ఇంటర్నల్ మీటింగ్

పొత్తు వద్దు

స్థానిక సంస్థల ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది కానున్నాయి. దీంతో అన్నిపార్టీలు మెజార్టీ సీట్లే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన బీఆర్ఎస్.. ఎక్కువ సీట్లు సాధించాలని, అందుకు కాంగ్రెస్ పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో సాధ్యమవుతుందనే ధీమాలో పార్టీ అధిష్టానం ఉంది. అంతేకాకుండా వామపక్షాలతో పొత్తుతో వెళ్తే ఇంకా ఎక్కువ సీట్లు సాధించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ముందుగా సీపీఎం పార్టీతో పొత్తు కుదుర్చుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఇప్పటికే సీపీఎంలో కీలకంగా ఇద్దరుముగ్గురు నేతలతో పొత్తుపై ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. అందులో కొంతమంది సమ్మతించినట్లు సమాచారం. మరికొందరు వద్దని తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన సీపీఎం నేతలు మాత్రం పొత్తు వద్దని వారిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తుపై ఊరించారని చివరకు తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభించారని మండిపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్‌తో పొత్తుకు పోతేనే పార్టీకి లాభం జరుగుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం. గులాబీపార్టీకి అవసరం అయినప్పుడు పొత్తు అంటే ఎలా కుదురుతుందని, వారి అవసరం తీరీన తర్వాత మళ్లీ దూరం పెడతారని పలువురు పేర్కొన్నట్లు సమాచారం.

Also Read- Ravi Teja: మాస్ మహారాజా రవితేజ రూటు మారుస్తున్నాడా? ‘మాస్’ వద్దనుకుంటున్నాడా?

సర్వత్రా చర్చ

సీపీఎం నేతలు మాత్రం స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఏ జిల్లాల్లో బలంగా ఉంటే ఆపార్టీతో కలిసి పోతామని బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటికే సీపీఐతో కలిసిపోతామని ప్రకటించారు. సీట్ల సర్దుబాటు చేసుకుంటామని ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలో బలంగా ఉండటంతో అక్కడ కలిసేందుకు పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఎలా పొత్తు కుదురుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆపార్టీతో పొత్తుకు కొంతమంది సీపీఎం నేతలు సమ్మతం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏ పార్టీతో సీపీఎం పొత్తు ఉంటుందనేది త్వరలోనే క్లారిటీ వస్తుందని పార్టీనేతలు తెలిపారు.

బీఆర్ఎస్‌ ఒంటరిగానేనా!

ఇప్పటికే సీపీఐ పార్టీ క్లారిటీ ఇచ్చింది. సీపీఎంతో పాటు కాంగ్రెస్ తో కలిసి పోతామని ప్రకటించింది. సీట్ల సర్దుబాటు చేసుకుంటామని ప్రకటించింది. అయితే ఏజిల్లాలో ఎన్ని సీట్లు కావాలో కోరేందుకు స్థానిక జిల్లా నేతలతో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఒప్పందం మేరకు పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధమవుతోంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్‌తో కలిసిపోయేది లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల్లోనూ ముందుకు పోతామని ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తుందా? లేకుంటే ఒంటరిగానే పోటీచేస్తుందా? అనేది ఆసక్తి నెలకొంది. వామపక్షాలతో ముందుకెళ్తే మెజార్టీ సీట్లు సాధించవచ్చని కొంతమంది గులాబీ పార్టీ సీనియర్ నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది