కరీంనగర్, స్వేచ్ఛః Karimnagar: చెరువు మట్టి చుట్టూ పెద్దపల్లి రాజకీయాలు తిరుగుతున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ గతంలో ఆరోపణలు చేసింది. అక్రమ మట్టి తవ్వకాలపై స్పందించిన అధికారులు జరిమానాలు విధించారు. ఎలాంటి జరిమాన చెల్లించకుండానే ఇటీవల మట్టి తరలింపు ప్రక్రియ చేపట్టడంతో పెద్దపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టిలకు పెట్టింది పేరు.. జిల్లాలో సుమారుగా 100 వరకు బ్రిక్స్ ఇండస్ర్టీస్ ఉన్నాయి. మట్టి ఇటుక తయారికి కావాల్సిన ముడి పదార్ధాలు పెద్దపల్లిలో లభించడంతో గడిచిన 20ఏళ్లుగా పెద్దపల్లి జిల్లాలో ఇటుక తయారి పరిశ్రమ మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. జిల్లాలోని చెరువుల్లో సారవంతమైన నల్లమట్టితో పాటు ఎన్టీపీసీ నుంచి బుడిద, రైస్ మిల్లుల నుంచి ఉనుకతో పాటు సింగరేణి నుంచి బొగ్గు లభిస్తుండటంతో ఇక్కడ మట్టి ఇటుకల పరిశ్రమ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇటుక తయారికి పెద్ద ఎత్తున చెరువు మట్టి అవసరం ఉండటంతో పరిశ్రమల యాజమానులు ప్రతియేటా ఎండకాలం సీజన్‌లో చెరువుల్లోనీరు తగ్గిన తరువాత మట్టిని తీసుకుంటారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని మట్టి తరలిస్తారు.
Also read: Rajiv Yuva Vikas Scheme: మంచి అవకాశం మించిన దొరకదు.. దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కలెక్టర్
2022లో పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి చెరువు నుంచి కొందరు వ్యాపారులు ప్రభుత్వం నుంచి 70,216 మెట్రిక్ టన్నుల మట్టికి అనుమతి తీసుకొని అనుమతికి మంచి మట్టిని తీశారు. అనుమతికి మించి మట్టిని తరలించడంతో వివాదం ఏర్పాడింది. స్థానిక బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అనుమతికి మించి తీసిన మట్టిపై విచారణ చేపట్టిన అధికారులు లక్ష 65వేల మెట్రిక్ టన్నుల మట్టిని తరలించినట్లు గుర్తించారు. కొత్తపల్లి చెరువు నుంచి అనుమతి తీసుకొని అధికంగా తరలించిన మట్టికి అధికారులు జరిమాన విధించారు. ఆరుగురు వ్యాపారులు మట్టి తరలింపుకు అనుమతి తీసుకోగా ఒక్క పరిశ్రమ నిర్వాహకుడికి రూ. 38లక్షలకు పైగా జరిమాన విధించారు. మొత్తం కలిపి దాదాపుగా రూ. 2కోట్లకు పైగా జరిమాన చెల్లించాలని అధికారులు నోటిసులు పంపించారు.
Also read: Fine Rice distribution: సన్నబియ్యం పంపిణీపై సర్వత్రా హర్షం.. సీఎం రేవంత్ కు పాలాభిషేకం
అధికారుల నోటిసుపై స్పందించని ఇటుక పరిశ్రమ నిర్వాహకులు ఇటీవల మట్టి తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. అదనంగా తీసిన మట్టికి ఎలాంటి జరిమాన చెల్లించకుండ మట్టి తరలించడం మరోమారు వివాదం ముదిరింది. జరిమాన లేకుండ మట్టి తరలింపుపై ఫిర్యాదు చేయగా రెండు రోజు క్రితం కొత్తపల్లిలోని మట్టి కుప్పలను అధికారులు సీజ్ చేశారు. మట్టి తరలింపు విషయంలో అప్పటి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణ రావుకు సంబంధం ఉందని వారి అనుచరులు మట్టి దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సురేష్ రెడ్డి ఆరోపణలు తిప్పికొడుతూ సోషల్ మీడియాలో రెండు పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నిశబ్దంగా ఉన్న పెద్దపల్లి రాజకీయాలు ఒక్కసారి మట్టి చూట్టు తిరుగుతున్నారు.