Bomb threat Hyderabad: ఆగంతకులు బాంబు బెదిరింపుల మెయిల్ పంపించి జడ్జిలు, అడ్వకేట్లతో పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్టుల ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్, జింఖానా గ్రౌండ్‌లలో పెట్టిన బాంబులు మరి కొద్ది సేపట్లో పేలనున్నాయని అందరినీ భయబ్రాంతులకు గురి చేశారు. ఉదయం సిటీ సివిల్ కోర్టుల చీఫ్ జస్టిస్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. abdia abdulla@hotmail.com నుంచి వచ్చిన మెయిల్‌లో కోర్టుతోపాటు జడ్జిల ఛాంబర్స్‌లో ఆర్డీఎక్స్‌తో చేసిన ఐఈడీ బాంబులు పెట్టాం, కొద్దిసేపట్లో అవి పేలనున్నాయని దుండగులు అందులో పేర్కొన్నారు. విషయం తెలియగానే బాంబు డిటెక్షన్ బృందాలు పోలీస్ జాగిలాలతో అక్కడికి చేరుకున్నాయి. అణువణువు గాలింపు జరిపాయి.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష!
పోలీసులు తనిఖీలు
అప్పటికే జడ్జిలు, అడ్వకేట్లు, కక్షిదారులు పరుగు పరుగున బయటకు వచ్చేశారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లభించక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒవైపు ఇక్కడ తనిఖీలు జరుగుతుండగానే రాజ్ భవన్, సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్, జింఖానా గ్రౌండ్‌లో కూడా బాంబులు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి. దాంతో, ఆయా చోట్ల కూడా పోలీసులు తనిఖీలు జరిపారు. ఎక్కడా బాంబులు దొరకలేదు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Indiramma Houses: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం