Ramchander Rao ( image credit: swetcha reporter or twiytter)
Politics, తెలంగాణ

Ramchander Rao: బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం స్టే ఇవ్వలేదు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Ramchander Rao: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల జీవోపై సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు  మీడియాతో ఆయన వివరించారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదని తెలిపారు. 73 ,74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక ఎన్నికలు జరపాల్సి ఉందన్నారు. జిల్లాల్లో రిజర్వేషన్లను ప్రకటించడాన్ని సైతం రాంచందర్ రావు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అక్కడక్కడ కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు తక్షణమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని రాంచందర్ రావు  (Ramchander Rao)తెలిపారు.

 Also Read: Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

ఆ బిల్లుకు బీజేపీ మద్దతు

న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి ఎన్నికలకు వెళ్లొచ్చన్నారు. ఆర్డర్లో కూడా 42 శాతం రిజర్వేషన్లపై ఏం మాట్లాడలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేవని, ఎన్నికలు నిర్వహించవచ్చన్నారు. బీజేపీ ఏ సామాజికవర్గానికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం చేయదని వివరించారు. 2011 తర్వాత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సెన్సెస్ కాలేదని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెన్సెస్ అనేది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సెన్సెస్ కూడా అథంటిక్ కాదని, సెన్సెస్ అయినవే అథంటిక్ అని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే అథంటిక్ కానప్పటికీ బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపామన్నారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ అడ్డుపడుతోందనేది అర్థంపర్థం లేని వాదనలంటూ కొట్టిపారేశారు. కాంగ్రెస్ బిల్లు పాస్ చేస్తే.. ఆ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపిందని, ఇంతకంటే తామేం చేయాలని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ వంకలు వెతుకుతోందని విమర్శలు చేశారు.

దేశం అభివృద్ధిలో ముందుండేలా మోడీ

ఇదిలా ఉండగా ఈనెల 30న హైటెక్స్ లో జరగబోయే ‘మేరా దేశ్ పహలే-ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ’ కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశం అభివృద్ధిలో ముందుండేలా మోడీ తీసుకొచ్చిన ఆవిష్కరణాత్మక నిర్ణయాలను, వారి నాయకత్వంలోని అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలను వివరిస్తూ ఈ వేడుక ద్వారా యువతకు స్ఫూర్తి కలిగేలా చూడాలని ఆకాంక్షించారు. అలాగే ఈ సమావేశంలో హైదరాబాద్ కార్పొరేటర్లు పాల్గొని నగర అభివృద్ధి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, జీఎస్టీ తగ్గింపుతో జరిగే మేలు గురించి వివరించాలని పిలుపునిచ్చారు. ఆపై హైటెక్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించిన పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాంచందర్ రావు పర్యవేక్షించారు.

 Also Read:R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే! 

Just In

01

Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి

Crime News: కొడుక్కి 18 ఏళ్లు నిండడానికి ఒక్క రోజు ముందు.. తండ్రి పక్కా ప్లాన్

Rural Health Care: పండుగకు తాళం వేసిన పల్లె దవాఖానలు.. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా..?

NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పథకం గురించి తెలుసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?