Boora Narsaiah Goud: గత ప్రభుత్వం గ్రూప్ 1 పేపర్ ను ట్యాంక్ బండ్ పై పల్లి, బఠాణి అమ్ముకునే పేపర్ల వలే అమ్ముకుందని, ఈ ప్రభుత్వం గ్రూప్ 1ను వెంటనే రీ ఎగ్జామ్ పెట్టాలన్నారు. లేదంటే బీజే(BJP)పీ నుంచి భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒక సంకర జాతి నాయకుడని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక సంకర జాతి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రాహుల్ తో పాటు ఇక్కడి నేతలు గజినీలుగా మారారని ఎద్దేవాచేశారు.
భారీస్థాయిలో బీసీ విద్రోహ సభ
రేవంత్ ఇచ్చిన హామీలు మర్చిపోతే ఒక డాక్టర్ గా తాను ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ ఇస్తానన్నారు. ఏం సాధించారని కామారెడ్డి(Kamareddy)లో బీసీ(BC) విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారని బూర ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది బీసీ విద్రోహ దినమే అని మండిపడ్డారు. కాంగ్రెస్(Congress) నేతలు విజయోత్సవ సభ జరిపితే.. అదే కామారెడ్డిలో తాము అంతకంటే భారీస్థాయిలో బీసీ విద్రోహ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అంటోందని, ఎవరిపై దర్యాప్తు చేయాలని ఆయన ప్రశ్నించారు. పిచ్చి తుగ్లక్ తో వేగలేక కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ అభ్యర్తికి ఓటు వేశారన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల జవాబు చూస్తే నవ్వొస్తోందని ఎద్దేవాచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు పెళ్లి చేసుకుంది ఒక్కరిని అయితే కాపురం ఇంకొరితో చేసినట్టు ఉందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ కు రాజ్యాంగంపై నమ్మకం ఉంటే వెంటనే ఆ పది మంది ఎమ్మెల్యేలలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read: Khammam District: చేసేది ప్రభుత్వ ఉద్యోగం.. కానీ సెటిల్మెంట్ లక్ష్యం.. ఇంతకీ ఎవరు..?