Telangana Assembly: శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల కునుకు
Telangana Assembly (imagecredit:twitter)
Telangana News

Telangana Assembly: తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల కునుకు.. వీడియో వైరల్!

Telangana Assembly: తెలంగాణ శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేల తీరు విమర్శలకు దారితీసింది. కృష్ణా నదీ జలాల తరలింపు, ప్రాజెక్టుల నిర్వహణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అత్యంత కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్(Palvai Harish,), రామారావు పాటిల్(Ramarao Patil), ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త(Dhanpal Suryanarayana Gupta) నిద్రలోకి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇంత నిర్లక్ష్యమా?

రాష్ట్ర భవిష్యత్‌ను, సాగునీటి అవసరాలను ప్రభావితం చేసే కృష్ణా జలాల అంశంపై మంత్రి సభకు వివరణ ఇస్తుండగా.. సభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న దృశ్యాలు చిక్కాయి. ఈ వీడియోలో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో నెటిజన్లు బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చ జరుగుతుంటే ఎమ్మెల్యేలకు ఇంత నిర్లక్ష్యమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కీలకమైన ప్రజల సమస్యలపై చర్చించేటప్పుడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

ప్రయోజనాల కంటే నిద్రే ముఖ్యమా?

అధికార కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వీడియోలను షేర్ చేస్తూ.. బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే నిద్రే ముఖ్యమా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండి, అందులోని లోపాలను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం.. ఇలా నిద్రపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై సభలో గళం విప్పాల్సిన నేతలు ఇలా కునుకు తీయడం పట్ల సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా ఈ అంశంపై బీజేపీ నేతలు మరోలా చెబుతున్నారు. కృష్ణా జలాల అంశంపై తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా కారణమేనని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీపై నిరసనగా తాము నిద్రిస్తున్నట్లుగా నిరసన వ్యక్తంచేసినట్లు చెబుతుండటం గమనార్హం.

Also Read: Medak district Crime: మెదక్ జిల్లాలో ఘోరం.. భర్తను గొంతు బిగించి చంపిన భార్య

Just In

01

Charu Sinha: నేరాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : అదనపు డీజీ చారు సిన్హా!

Indian Woman Murder: అమెరికాలో ఘోరం.. భారత సంతతి యువతి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

Vijay Kumar: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు వార్నింగ్..ఈ రూల్స్ పాటించాల్సిందే : అదనపు డీజీపీ విజయ్ కుమార్

Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్!

MLC Naveen Rao: ఆరోపణల పేరుతో అవాస్తవాలను నమ్మొద్దు.. సిట్ ఎప్పుడు పిలిచినా సహకరిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు!