BJP GST Drive (imagecrdit:twitter)
తెలంగాణ

BJP GST Drive: జీఎస్టీతో ప్రజల్లో బీజేపీ.. నేటి నుంచి మూడు రోజుల పాటు డ్రైవ్

BJP GST Drive: తెలంగాణ కాషాయ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబులు తగ్గించడంపై ప్రజలకు వివరించాలని భావిస్తోంది. అందుకు గాను ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడ్రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం చేవెళ్​ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించేందుకు, జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను ఈ కమిటీ నిర్వహించనుంది. కాగా ఇప్పటికే జిల్లా స్థాయిలో నలుగురితో కూడిన కమిటీలను సైతం పార్టీ నియమించింది. అందులో ఒకరు కన్వీనర్ గా, ముగ్గురు కో కన్వీనర్లుగా ఉన్నారు. వారు ఈ మూడ్రోజుల పాటు జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి జీఎస్టీ(GST) పై అవగాహన కల్పించనున్నారు.

స్టిక్కర్ క్యాంపెయిన్ పేరిట..

జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో శక్తికేంద్రాలు.. గ్రామస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ లెవల్లో స్టేక్ హోల్టర్స్ మాత్రమే కాకుండా సామాన్యులు, ఫిక్కీ ఫోరమ్, కిరాణా షాపుల యాజమాన్యాలు కలుపుకుని కనీసం 500 నుంచి 3 వేల మందికి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా స్టిక్కర్ క్యాంపెయిన్ పేరిట షాపులు, కిరాణాల వద్ద స్టిక్కర్లను అతికించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కూడళ్ల వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. జీఎస్టీ శ్లాబ్ లు గతంలో 4 ఉంటే ఇప్పుడు 2 శ్లాబులకు కేంద్రం కుదించింది. దీనివల్ల కేంద్రానికి, రాష్ట్రానికి ట్యాక్స్ తగ్గినా సామాన్యులకు లబ్ధి జరగనుందనే విషయాలను పూసగుచ్చినట్లుగా వివరించేందుకు సిద్ధమవ్వాలని పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Also Read; Viral Video: గరిట ఎందుకు దండగ.. జేసీబీ ఉండగా.. పాపం తినేవారి పరిస్థితేంటో!

ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కర

జీఎస్టీ శ్లాబులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా దీన్ని ప్రజలకు అందించాలని తొలుత నిర్ణయించింది. కానీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అందించాలని ఈనెల 22 నుంచి అమలుచేస్తోంది. ఇదిలా ఉండగా ప్రజలకు అవగాహన కార్యక్రమాల్లో అపోహల తొలగింపునకు బీజేపీ(BJP) ప్రధాన ప్రియారిటీ ఇవ్వాలని భావిస్తోంది. ఎందుకంటే హోల్ సేల్(Hole Sale) లో ముందుగానే జీఎస్టీ(GST) కట్టి తీసుకున్న వస్తువులకు ఈనెల 22 నుంచి తగ్గించి ఇవ్వడం వల్ల వ్యాపారులు నష్టపోతారని చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి అంశాలను గుర్తించి ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కరించే మార్గాలు సైతం కేంద్రం అన్వేషించిందని బీజేపీ(BJP) చెబుతోంది. ఇలాంటి అపోహలు తొలగించినట్లయితే పార్టీకి కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వీటి అమలులో అవసరమయ్యే అభిప్రాయాలున్నా సూచించాలని పార్టీ పిలుపునివ్వనుంది. ఇప్పటికే రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చిన కేంద్రం సామాన్యులకు ఊరట కల్పించింది. ఇప్పుడు జీఎస్టీ శ్లాబులు తగ్గించి ప్రజలను తమ వైపునకు ఆకర్షితులను చేసుకోవాలన్న బీజేపీ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందనేది చూడాలి.

Also Read: Sreenanna Andarivadu: 6 భాషల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి బయోపిక్.. హీరో పాత్రలో సుమన్

Just In

01

Mahabubabad District: తొర్రూరు మున్సిపాలిటీలో వివాదం.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు?

Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!

Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ

Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా .. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్

Viral Video: నషా ఎక్కిన యువ జంట.. పోలీసు జీపుపైనే రొమాన్స్.. ఎంతకు తెగించార్రా!