Heavy Rains: గత రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వాతావరణం మారబోతుంది. ఐఎండీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. వచ్చే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
Also Read: Bonalu Festival: బోనాల జాతరకు రూ.20కోట్లు.. ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం!
తెలంగాణలో మే నెలలో వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే చిరు జల్లులు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.
అయితే, ఈ నెలలో గడిచిన వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. దీని వలన ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది.
Also Read: Warangal Museum: మ్యూజియం కూలకుండా కర్రల సపోర్ట్.. ఓరుగల్లు చారిత్రాత్మక సంపదకు దిక్కేది..?
ముఖ్యంగా, తెలంగాణలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావం వలన సోమవారం నుంచి మొదలుకుని బుధ వారం వరకు ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపారు. గంటకు 35 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: Shrasti Verma : కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు హామీ