Shrasti Verma : ఈ మధ్య కాలంలో సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈమె జానీ మాస్టర్ పై చేసిన సంచలన ఆరోపణలు పెద్ద దూమరమే రేపాయి. ఆ రోజున ఈమె పెట్టిన కేసులో ఎంత నిజముందో తెలీదు. కానీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, తాజాగా శ్రేష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. గుంటూరు జిల్లా SP కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI గుంటూరు జిల్లా నాయకులు ఆమె మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే NSUI మెంబర్స్ ఆమెను అరెస్ట్ చేయాల్సిందే అంటూ ఆందోళన చేస్తున్నారు.
Also Read: Thummala Nageswara Rao: కమిషన్‌కు ఈటల చెప్పిందంతా అబద్దం.. నా పేరు ఎందుకు తీశారు.. తుమ్మల ఫైర్!
మహాత్మ గాంధీ తల్లిని, నెహ్రూ తల్లిని అసభ్యకరంగా తిట్టడమే కాకుండా.. ఇంకా ఇష్ట రాజ్యాంగా వ్యాఖ్యలు కూడా చేసింది. ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ పై కామెంట్ చేసింది. అంతే కాకుండా దానికి రిప్లై కౌంటర్ కూడా ఇచ్చింది. ఆమె చాలా ఈజీగా ఇట్స్ ఒకే బ్రో .. అంటూ కూల్ గా రియాక్ట్ అయింది.
కన్నప్ప మూవీ ప్రమోషన్స్ కి గుంటూరు నగరానికి వెళ్ళిన MAA అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ను NSUI బృందం కలిసినట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. తెలుగు సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శ్రేష్టి వర్మ స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గార్లను అసభ్యకరంగా కించపరుస్తూ మాట్లాడిన మాటలు అందరికీ తెలిసినవే. అదే విధంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు స్వాతంత్ర సమరయోధులపై చేసిన మూవీస్ ను కూడా అవమాన పరుస్తూ.. వారిని కూడా కించ పరిచిందని తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తెలుగు సినిమా MAA అసోసియేషన్ ఖండిస్తూ వ్యతిరేకించాలని తెలుగు సినిమా కొరియోగ్రాఫర్ శెష్టి వర్మ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా NSUI బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
వెంటనే, దీనిపై స్పందించిన తెలుగు సినిమా MAA ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.